- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మారుతికి షాక్ ఇచ్చిన ప్రభాస్ అభిమానులు.. ఊహించని గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజాసాబ్’(The Raja Saab)పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజాసాబ్’(The Raja Saab)పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న మారుతి(Maruthi)పై ప్రభాస్ అభిమానులు మరోసారి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తాజాగా, డార్లింగ్ అభిమానులు మారుతికి ఊహించని గిఫ్ట్ పంపించి సర్‌ప్రైజ్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా హీరోలకు మాత్రమే కానుకలు పంపే అభిమానులు, ఈసారి డైరెక్టర్‌కు ప్రత్యేకంగా గిఫ్ట్ పంపడం విశేషంగా మారింది. రెండో ట్రైలర్ విడుదల చేయడంతో ఫుల్ ఖుష్ అయిన అభిమానులు మారుతికి తమ ప్రేమను ఈ విధంగా వ్యక్తం చేశారు. ఆ గిఫ్ట్‌తో పాటు శుభాకాంక్షల సందేశాన్ని కూడా పంపినట్లు సమాచారం.
ఇక బిర్యాని చూసిన మారుతి షాక్ అయ్యాడు. ఈ విషయాన్ని తెలుపుతూ.. ట్విట్టర్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘‘డార్లింగ్స్ ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఇంటికి వచ్చిన వెంటనే దీన్ని చూసి షాక్ అయ్యాను. బిర్యానీని పంపినందుకు ధన్యవాదాలు. జనవరి 9న మీకు నేను మరింత ఇస్తాను. మీరింత వైలెంట్‌గా ఉన్నారు. అడ్రెస్ ఇచ్చింది వేరే దానికి మీరు ఇలా కూడా వాడేసుకుంటున్నారు’’ అని రాసుకొచ్చారు. కాగా.. ‘ది రాజాసాబ్’ మూవీ భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం హారర్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రానుంది. ఇందులో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ నటిస్తుండగా.. యోగిబాబు, సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.






