ప్రభాస్ సంచలన నిర్ణయం.. అయోధ్యలో దానికోసం రూ.50 కోట్ల విరాళం..?

by I. Sairam |

ప్రస్తుతం దేశం మొత్తం రామనామం మారుమోగుతుంది. అటు శ్రీరాముడి జన్మస్థలం

ప్రభాస్ సంచలన నిర్ణయం.. అయోధ్యలో దానికోసం రూ.50 కోట్ల విరాళం..?
X

దిశ, సినిమా: ప్రస్తుతం దేశం మొత్తం రామనామం మారుమోగుతుంది. అటు శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తైంది. ఈనెల 22న ఆలయంలో రాముడి ప్రాణప్రతిష్టాపన జరగనుంది. అయితే రామ మందిర నిర్మాణం కోసం ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చి విరాళాలు సేకరించడం మొదలు పెట్టింది. దీంతో లక్షల మంది భక్తులు ముందుకు వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీరాముడి భక్తులు భారీగా విరాళాలు అందించారు.

అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజుల వంశానికి చెందిన వ్యక్తి అనే సంగతి అందరికీ తెలిసిందే. ఫుడ్ విషయంలో రాజ మర్యాదలు గతంలో ఎలా చేసేవారో ప్రభాస్ కూడా తన ఇంటికి ఎవరు వచ్చినా కూడా అలాగే అతిథ్యం ఇస్తారు. తనతో పనిచేసే నటీనటులను తన ఇంటికి తీసుకెళ్లి మరీ అన్ని రకాల భోజనం వండి పెడతారు. ఇందులో భాగంగా తాజాగా అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా.. భక్తులకు అన్న ప్రసాద నిమిత్తము తన వంతుగా ప్రభాస్ రూ.50 కోట్లు విరాళంగా ప్రకటించినట్లు సమాచారం.


Next Story