- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభాస్ ‘ది రాజా సాబ్’ సినిమా రీషూట్.. విడుదల వాయిదాపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
హారర్ కామెడీ ఎంటర్‌గా రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్’(The Rajasaab).

దిశ, సినిమా: హారర్ కామెడీ ఎంటర్‌గా రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్’(The Rajasaab). పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), మారుతి (Maruti)కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం పలు వాయిదాల తర్వాత వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల తేదీని లాక్ చేసుకుంది. ఈక్రమంలో.. ఈ సినిమాలోని పలు సీన్స్‌ను రీషూట్ చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో జోరందుకున్నాయి. షూటింగ్ పూర్తి చేసుకోని ‘ది రాజాసాబ్’ రీషూట్ చేస్తే మళ్లీ వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు పుకార్లు వస్తున్నాయి. ఈనేపథ్యంలో.. తాజాగా, నిర్మాత ఎస్‌కెఎన్ ట్విట్టర్ ద్వారా ఈ వార్తలకు చెక్ పెట్టారు. ‘‘పండగకు వస్తున్నాం.. పండగ చేస్తున్నాం’’ అని రాసుకొచ్చారు.
దీంతో పుకార్లకు చెక్ పడింది. కాగా.. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. సంజయ్ దత్, యోగిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా.. యూవీ క్రియేషన్స్,skn బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రభాస్ ఇలాంటి జానర్‌లో సినిమా చేయకపోవడంతో ‘ది రాజాసాబ్’ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఎప్పటికప్పుడు వెయిట్ చేస్తున్నారు. ఇక విడుదలైన టీజర్, ట్రైలర్, పోస్టర్లు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి.






