'కార్తికేయ 2' టీమ్‌ను ఆశ్చర్యపరిచిన ప్రభాస్

by Disha Web Desk 7 |
కార్తికేయ 2 టీమ్‌ను ఆశ్చర్యపరిచిన ప్రభాస్
X

దిశ, సినిమా : చిన్న చిత్రంగా విడుదలైన 'కార్తికేయ 2' బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. బాలీవుడ్‌లోనూ ఫుల్ పాపులారిటీ సంపాదించుకుని ఏకంగా అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చడ్డా', అక్షయ్ కుమార్ 'రక్షా బంధన్' సినిమాలకు గట్టి పోటీ ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే స్టార్ హీరో ప్రభాస్ సైతం 'కార్తికేయ 2' టీమ్‌ను ప్రత్యేకంగా ప్రశంసించాడు. అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి కాంప్లిమెంట్స్ పొందడం ఈ చిత్రానికి హిందీలో మరింత ప్లస్ కానుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా 'బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టినందుకు నిఖిల్, అనుపమ, అనుపమ్ ఖేర్, చందూ మొండేటి, భైరవ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, #కార్తికేయ2 మొత్తం టీమ్‌కు అభినందనలు' అని ప్రభాస్ తన స్టేటస్‌లో పంచుకున్నాడు.

Next Story

Most Viewed