నా మేడం కృతి అంటూ.. జానకి అని చెప్పకనే చెప్పిన Prabhas

by Disha Web Desk 10 |
నా మేడం కృతి అంటూ..  జానకి అని చెప్పకనే చెప్పిన Prabhas
X

దిశ, సినిమా : బాలయ్య హోస్ట్ గా ఆహాలో ప్రసారమవుతున్న టాక్ షో 'అన్ స్టాపబుల్ విత్ NBK'. ఈ షోలో వ్యవహరించడం వల్ల బాలయ్యకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇక సెకండ్ సీజన్‌లో అదిరిపోయే గెస్టులను ఇన్వైట్ చేస్తూ వస్తున్నారు బాలయ్య. రీసెంట్ షో‌లో ప్రభాస్ పాల్గొన్న విషయం తెలిసిందే. గురువారం రాత్రి 9 గంటలకు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కావాల్సి ఉండగా..డార్లింగ్ ఫ్యాన్స్ దెబ్బకు ఆహా యాప్ క్రాష్ అయినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. దీంతో అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. ఇక ఇందులో భాగంగా బాలయ్య ప్రభాస్‌ను మ్యారేజ్ గురించి అడగ్గా..తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ నందమూరి హీరో అస్సలు ఒప్పుకోలేదు. దీంతో ప్రభాస్ 'పెళ్లి నాకు ఇంకా రాసిపెట్టలేదు సార్' అంటూ సరదాగా చెప్పారు. ఇటీవల ప్రభాస్, కృతి సనన్‌తో ప్రేమ అంటూ వచ్చిన వార్తల గురించి బాలయ్య..'ఎంతో మంది హీరోయిన్స్‌తో నటించిన రాముడు, సీత తోనే ఎందుకు ప్రేమలో పడ్డాడు అని' అడగ్గా దానికి ప్రభాస్ స్పందిస్తూ 'అది ఎప్పుడో పాత న్యూస్.. అప్పుడే మేడం చెప్పింది‌గా సార్..అలాంటిదేం లేదు' అంటూ సిగ్గు పడ్డాడు..సరే మేడం పేరు చెప్పు అని బాలయ్య అడిగాడు 'జానకి సార్' అని చెప్పాడు..కృతినే అని ఒప్పుకున్నాడు. ఎందుకంటే 'ఆదిపురుష్' మూవీ‌లో సీత పాత్రలో కృతి నటిస్తోంది. సో..సీతకి మరో పేరు జానకి కనుక..జానకి అని చెప్పకనే చెప్పాడు ప్రభాస్.

Also Read...

డిసెంబర్ 31న 'Khushi' మూవీ రీ రిలీజ్..బ్లాక్‌లో టికెట్ ధర ఎంతో తెలుసా ?

2023లో ప్రభాస్ అనారోగ్యం పాలవుతాడా..? వేణు స్వామి సంచలన కామెంట్స్

అన్ స్టాపబుల్ షో అనధికారిక ప్రసారాలు ఆపివేయండి.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

Prabhas ఫ్యాన్స్ దెబ్బకు ఆహా సైట్ క్రాష్..! |

Next Story

Most Viewed