‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాకు ప్రభాస్ రివ్యూ.. జీవితకాలం గుర్తుండి పోతుందంటూ ఆసక్తికర పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-15 10:12:47  IST  )

ఈ మూవీ చూసిన ప్రభాస్, తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చిత్ర బృందానికి అదిరిపోయే కాంప్లిమెంట్ ఇచ్చారు.

‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాకు ప్రభాస్ రివ్యూ.. జీవితకాలం గుర్తుండి పోతుందంటూ ఆసక్తికర పోస్ట్
X

దిశ, సినిమా: యంగ్ హీరో సంతోష్ శోభన్(Santosh Shobhan), మానసి వారణాసి (Manasa Varanasi)జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కపుల్ ఫ్రెండ్లీ’(Couple friendly). అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. సామాన్య ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేరారు. ఈ మూవీ చూసిన ప్రభాస్, తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చిత్ర బృందానికి అదిరిపోయే కాంప్లిమెంట్ ఇచ్చారు. ప్రభాస్ తన పోస్ట్‌లో ఒక ఆసక్తికరమైన పోలికను వాడుతూ చిత్ర యూనిట్‌ను ఆకాశానికెత్తారు. ‘‘నా కెరీర్‌లో ‘వర్షం’ సినిమా నాకు ఎంత స్పెషల్‌గా నిలిచిపోయిందో, సంతోష్ శోభన్ కెరీర్‌లో ‘కపుల్ ఫ్రెండ్లీ’ కూడా అలాగే జీవితాంతం గుర్తుండిపోయే మూవీ అవుతుంది’’ అని ప్రభాస్ పేర్కొన్నారు.

చాలా ఎంజాయ్ చేశా..

హీరో సంతోష్ శోభన్, హీరోయిన్ మానసి తమ నటనతో ఆకట్టుకున్నారని, దర్శకుడు అశ్విన్ ఈ కథను ఎంతో ప్రతిభావంతంగా తెరకెక్కించారని ఆయన ప్రశంసించారు. తన మిత్రులు అజయ్, యూవీ క్రియేషన్స్ సంస్థ ఇలాంటి మంచి కథలను ఎంకరేజ్ చేస్తున్నందుకు అభినందనలు తెలిపారు. గతంలో ప్రభాస్‌కు ‘వర్షం’ వంటి ఇండస్ట్రీ హిట్ అందించిన దర్శకుడు శోభన్ కుమారుడే ఈ సంతోష్ శోభన్. ఆ పాత అనుబంధంతో ప్రభాస్ ఎప్పుడూ సంతోష్ సినిమాలకు తన వంతు మద్దతు ఇస్తుంటారు. ఇప్పుడు ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాను తాను ఎంతో ఎంజాయ్ చేశానని ప్రభాస్ స్వయంగా చెప్పడంతో సినిమా రేంజ్ పెరిగిపోయింది. ప్రభాస్ సపోర్ట్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరిన్ని వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని నెటిజన్లు భావిస్తున్నారు.

కపుల్ ఫ్రెండ్లీ : మొదటిరోజు గట్టిగానే రాబట్టిందిగా

న్యాయం కోసం ప్రధాని మోదీ దగ్గరికైనా వెళ్తాము.. ‘కపుల్ ఫ్రెండ్లీ’ నిర్మాత సంచలన వ్యాఖ్యలు

Next Story