అనుష్క కోసం రంగంలోకి దిగిన ప్రభాస్.. నిన్ను చూసేందుకు వేచి ఉండలేకపోతున్నానంటూ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-09-17 06:05:04  IST  )

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty), క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘ఘాటి’(Ghati).

అనుష్క కోసం రంగంలోకి దిగిన ప్రభాస్.. నిన్ను చూసేందుకు వేచి ఉండలేకపోతున్నానంటూ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty), క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘ఘాటి’(Ghati). యాక్షన్ క్రైమ్ డ్రామా చిత్రంగా తెరకెక్కగా.. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై నిర్మించారు. ఇందులో విక్రమ్ ప్రభు(Vikram Prabhu) ప్రధాన పాత్రలో నటించారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన అన్ని అప్డేట్స్ విడుదలై ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా, ‘ఘాటి’ సినిమా కోసం ప్రభాస్ రంగంలోకి దిగారు. ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ గ్లింప్స్‌ను రిలీజ్ చేస్తూ.. ఘాటి రిలీజ్ ట్రైలర్ ఇంటెన్స్ అంట్ ఆసక్తికరంగా ఉంది.. నిన్ను పవర్ ఫుల్ లుక్‌లో చూసేందుకు వేచి ఉండలేకపోతున్నాను స్వీటీ. మూవీ టీమ్ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను’’ అని రాసుకొచ్చాడు. ఇక ఈ రిలీజ్ ట్రైలర్ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి. అనుష్క చేయబోయే ఊచకోతకు గూస్‌బంప్స్ గ్యారెంటీ అనేలా ఉంది. స్వీటీ చేసిన యాక్షన్ సినిమాకే హైలెట్‌గా నిలిచేలా ఉంది. సూపర్బ్ బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌తో సాగిన రిలీజ్ ట్రైలర్‌లో అనుష్క పర్ఫామెన్స్ మామూలుగా లేదు. శీలావతిగా ఆమె చేసిన పోరాట సన్నివేశాలు ట్రైలర్‌లో హైలెట్‌గా నిలిచాయి. ఈసారి దర్శకుడు క్రిష్ ఊహించని యాక్షన్ ఎలిమెంట్స్‌తో అనుష్కతో ఊచకోత చేయించినట్టుగా ఉంది.

అనుష్క ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ముందే రానని చెప్పినప్పటికీ.. సోషల్ మీడియా వేదికగా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే రానాతో ఫోన్ కాల్‌లో మాట్లాడిన స్వీటికి ఇప్పుడు ప్రభాస్ రిలీజ్ ట్రైలర్ లాంచ్ చేయడం సినిమాకు మంచి బజ్ జనరేట్ అయ్యేలా చేసింది. దీంతో.. ఘాటి రాక కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు. సెప్టెంబర్ 5న ఈ చిత్రం థియేటర్లోకి రానుండగా.. ఇంకొన్ని గంటల్లో తెరపై శీలావతి ఊచకోతను చూడబోతున్నాం. ఈ సినిమాలో అనుష్క పాత్ర అరుంధతికి మించి ఉంటుందనే టాక్ అయితే గట్టిగా వినిపిస్తోంది. గతంలో క్రిష్ దర్శకత్వంలో వేదం అనే సినిమాలో నటించారు అనుష్క. ఆ సినిమాలో సరోజ పాత్ర లాగే, ఇప్పుడు 'ఘాటి'లో షీలావతి పాత్ర ప్రత్యేకంగా ఎప్పటికి ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉంటుందనే అంచనాలున్నాయి.

Next Story