ప్రభాస్ ఇద్దరు హీరోయిన్లను సెట్ చేయమని అన్నాడు.. షాకింగ్ విషయాలు రివీల్ చేసిన మారుతి (వీడియో)

by Mallepaka Hamsa |

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), మారుతి(maruthi) కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్’(The Rajasaab).

ప్రభాస్ ఇద్దరు హీరోయిన్లను సెట్ చేయమని అన్నాడు.. షాకింగ్ విషయాలు రివీల్ చేసిన మారుతి (వీడియో)
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), మారుతి(maruthi) కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్’(The Rajasaab). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో నిధి అగర్వాల్(Nidhi Agarwal), మాళవిక మోహనన్, రిద్ధి కుమార్‌(Riddhi Kumar) హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ 5న క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా పలు సార్లు వాయిదా పడుతూ వస్తున్నప్పటికీ ప్రభాస్ అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లోకి వస్తుందా.. అని ఎదురుచూస్తున్నారు.

అంతేకాకుండా అప్డేట్స్ వస్తున్నాయంటే చాలు.. డార్లింగ్ అభిమానుల హడావిడి మామూలుగా లేదు. తాజాగా, ‘ది రాజాసాబ్’ టీజర్‌ను నేడు రిలీజ్ చేశారు. హైదరాబాద్ ప్రసాద్ మల్టీ ఫ్లెక్స్‌లో గ్రాండ్‌గా ఈవెంట్ నిర్వహించి టీజర్‌ను విడుదల చేశారు. ఇక హారర్, కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ టీజర్ ప్రేక్షకుల్లో సినిమాపై మరింత హైప్ పెంచేసింది. ఇక ఈ టీజర్ ఈవెంట్‌లో పాల్గొన్న మారుతి షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. అసలు ‘ది రాజా సాబ్’ మూవీలో ముగ్గురు హీరోయిన్లను పెట్టడానికి కారణం ప్రభాస్ అని అసలు విషయం రివీల్ చేశాడు. ‘‘జీవితంలో హీరోయిన్స్ లేక చప్పగా ఉన్న ఆయన ఒక ఇద్దరినీ పెట్టగలవా డార్లింగ్ అని నాతో అన్నారు. ఇక దానికి నేను మీ రేంజ్‌కి ఇద్దరు ఏంటి, ముగ్గుర్ని పెడతా అన్నాను. సలార్‌లో ఎవరూ లేరు ఉన్న అమ్మాయి కూడా ఎప్పుడో వస్తుంది.

ఆ తర్వాత వచ్చిన ‘కల్కి’ మూవీలో కూడా సరదాగా వచ్చినా వెళ్లిపోయింది. ఆదిపురుష్‌లో సీతాదేవి ఆవిడ ఎక్కడో ఉంటది. కానీ నా దగ్గర నా ఇంట్లో ఎవరూ లేరు డార్లింగ్ అందుకే ఓ ఇద్దరు హీరోయిన్లను సెట్ చేయి అని అన్నారు. ఆయన అన్న మాటకు నేను పైనుంచి కింద వరకు చూసి డార్లింగ్ మీ రేంజ్‌కు ముగ్గురిని పెడతా అన్నాను’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ప్రభాస్ అంత రొమాంటిక్ ఫెలోనా అని షాక్‌కు గురవుతున్నారు.

twitter link

Next Story