Project-K టైటిల్ బజ్.. సినిమా పేరు తెలిసిపోయిందోచ్.. సూపర్ హీరోగా ప్రభాస్

by Disha Web Desk |
Project-K టైటిల్ బజ్.. సినిమా పేరు తెలిసిపోయిందోచ్.. సూపర్ హీరోగా ప్రభాస్
X

దిశ, సినిమా : ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ప్రాజెక్ట్-కె’. జస్ట్ పోస్టర్స్‌తోనే వరల్డ్ వైడ్ అటెన్షన్ క్రియేట్ చేస్తున్న మూవీ అసలు టైటిల్ ఏంటో తెలుసుకునేందుకు ఎగ్జయిటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. పైగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణే లాంటి స్టార్స్ నటిస్తున్న మూవీపై ఇప్పటికే అంచనాలు పెరగ్గా.. కామిక్-కాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సినిమాను లాంచ్ చేయనున్నారు. కాగా మహాభారతం స్ఫూర్తితో తెరకెక్కుతున్న మూవీకి ‘కాలచక్రం’ టైటిల్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. బిగ్ బి అశ్వత్థామ లాంటి స్ట్రాంగ్ రోల్‌లో కనిపించబోతున్నట్లు నెట్టింట చర్చ జరుగుతుండగా.. ప్రభాస్ శ్రీకృష్ణుడి మాదిరిగా కాలాన్ని కంట్రోల్ చేసే పాత్రలో నటించనున్నట్లు టాక్. ఇక మిగిలిన క్యారెక్టర్స్ గురించి తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed