సంక్రాంతి పండుగ వేళ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్.. పోస్ట్ వైరల్

by Disha Web Desk 6 |
సంక్రాంతి పండుగ వేళ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టాన్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ ద‌ర్శక‌త్వంలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా హిందూ మైథలాజి కథతో తెరకెక్కుతున్న సినిమా ‘కల్కి 2898 AD’. ఈ మూవీలో కమల్‌ హాసన్‌, దీపికా పదుకొనే, దిశా పటాని, అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. దీంతో ఫ్యాన్స్ కల్కి నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా, ప్రభాస్ గుడ్ న్యూస్ చెబుతూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేశాడు. కల్కి సినిమా 2024 మే9న థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశాడు. దీంతో అది చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. కాగా, సంక్రాంతి కానుకగా కల్కి టీజర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Next Story