శింబు-వెట్రిమారన్ ‘STR-49’ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్.. పోస్టర్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చిన మేకర్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-10-07 05:47:26  IST  )

కోలీవుడ్ స్టార్ హీరో శింబు(Simbu), వెట్రిమారన్(Vetrimaran) కాంబినేషన్‌లో భారీ ప్రాజెక్ట్ రాబోతుంది.

శింబు-వెట్రిమారన్ ‘STR-49’ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్..  పోస్టర్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చిన మేకర్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో శింబు(Simbu), వెట్రిమారన్(Vetrimaran) కాంబినేషన్‌లో భారీ ప్రాజెక్ట్ రాబోతుంది. ‘STR-49’ వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. దీనిని వి క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. తమిళ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో సమంత, శ్రీలీల, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటించబోతున్నట్లు టాక్. గత కొద్ది రోజులుగా ‘STR-49’కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. తాజాగా, వెట్రిమారన్ ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి సినీ ప్రియులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు.

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాకు ‘అరసన్’ (Arasan)అనే పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. అరసన్ అనగా కింగ్ అర్థం అని తెలుస్తోంది. ఇక విడుదలైన ఫస్ట్ లుక్‌లో శింబు చికట్లో నిల్చొని ఒక చేతిలో కత్తి.. మరో చేత్తో సైకిల్ పట్టుకుని కనిపించాడు. ఇందులో ఆయన ముఖం కనిపించకుండా ఓ లైట్ ఫోకస్ కోడుతోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతోంది. అలాగే పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. ఈ సినిమా పోస్టర్‌లో శింబు పట్టుకున్న కత్తి ‘వాడ చెన్నయ్’లో ధనుష్ వాడిన కత్తిని పోలి ఉండటం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై నెటిజన్లు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. వెట్రిమారన్ సినిమాటిక్ యూనివర్స్‌లో రాబోతున్న ఈ మూవీ ‘వాడ చెన్నయ్’కి సీక్వెల్‌గా రాబోతుందనే ప్రచారం మొదలైంది.

Next Story