పవన్ కల్యాణ్ న్యూ లుక్.. ఫ్యాన్స్‌కు పూనకాలే!

by Disha Web Desk 2 |
పవన్ కల్యాణ్ న్యూ లుక్.. ఫ్యాన్స్‌కు పూనకాలే!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలతో సంబంధం లేకుండా కల్ట్ ఫాలోయింగ్‌‌ను సంపాదించుకున్న ఏకైక హీరో పవన్ కల్యాణ్ అని.. ఇండస్ట్రీ పెద్దలే చెబుతుండటం గమనార్హం. ముఖ్యంగా స్టైల్‌లో పవన్ కల్యాణ్ సెట్ చేసిన ట్రెండ్‌ను టాలీవుడ్‌లోని అనేకమంది హీరోలే ఫాలో అవుతుండటం తెలిసిన విషయమే. తాజాగా.. మరో క్రేజీ కాస్టూమ్‌తో పవన్ కల్యాణ్ ట్రెండ్ క్రియేట్ చేయడానికి సిద్ధమయ్యారు. శనివారం ఏపీలో జనసేన ఆధ్వర్యంలో నిర్వహించబోయే బీసీ సమావేశానికి పవన్ కల్యాణ్ ఆర్మీ ప్యాంట్, బ్లాక్ టీ-షర్ట్‌లో ఎయిర్‌పోర్టుకు వచ్చారు. దానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ లుక్‌తో ఒక ఫుల్ లెంగ్త్ సినిమా పడాలి అంటూ ట్విట్టర్‌లో కామెంట్లు పెడుతూ ట్రెండ్ చేస్తున్నారు.

Next Story