- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ కన్నుమూత
by GSrikanth |
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.

X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. కాగా, తెలుగు సినిమా అభిమానులకు రాకేశ్ మాస్టర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ‘ఆట డ్యాన్స్ షో’తో ఆయన తన కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడి నుంచి డ్యాన్స్ మాస్టర్‌గా ఎదిగి దాదాపు 1500 సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ఇండస్ట్రీలోని అగ్ర నటులందరితోనూ ఆయన పనిచేశారు. ఇటీవల సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన.. యూట్యూబ్ ఛానల్ పెట్టారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు విషయాలపై స్పందిస్తుండేవారు. ఆయన మృతిపట్ల ఇండస్ట్రీ వర్గాలు సంతాపం ప్రకటిస్తున్నారు.
Next Story






