- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ప్రముఖ నటి.. పరిస్థితి విషమం
సినీ ఇండస్ట్రీలలో నటీనటుల ఆరోగ్యం గురించి అనేక వార్తలు వస్తుంటాయి. ఇటీవల సమంతకు కూడా ఓ అరుదైన వ్యాధి సోకడంతో తను కూడా చికిత్స పొందుతుంది.

దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలలో నటీనటుల ఆరోగ్యం గురించి అనేక వార్తలు వస్తుంటాయి. ఇటీవల సమంతకు కూడా ఓ అరుదైన వ్యాధి సోకడంతో తను కూడా చికిత్స పొందుతుంది. అయితే సమంత కొద్ది కొద్దిగా కోలుకుంటుందన్న వార్త అభిమానుల్లో కాస్త ధైర్యాన్ని నింపింది. ఇదిలా ఉంటే.. తాజాగా మరోనటి పరిస్థితి సీరియస్ ఉందంటూ వర్తలు వినిపిస్తున్నాయి.
ఆమె మరెవరో కాదు.. ప్రముఖ బెంగాలీ నటి ఐంద్రీలా శర్మ. వెండి తెరపై తన అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించిన ఐంద్రీలా ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఇంతకు ముందే రెండు సార్లు క్యాన్సర్ సోకిన.. పోరాడి ప్రాణాలతో బయటపడింది. కానీ, ఇప్పుడు మళ్లీ ఆమె ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవల స్ట్రోక్ రావడంతో ఆమె ఆసుపత్రిలో చేరారు. వెంటనే పక్షపాతం రావడం, మెదడలో రక్తం గడ్డకట్టడంతో ఆమె కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు తెలిపారు. కాగా.. ప్రస్తుతం వైద్యులు ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : షూటింగ్‌లో తలకు గాయం.. గతం మరిచిపోయిన హీరోయిన్






