రెమ్యునరేషన్ పై ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు

by Dishanational2 |
రెమ్యునరేషన్ పై ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, సినిమా : బాలీవుడ్‌ ఇండస్ట్రీలో రెమ్యునరేషన్ వ్యత్యాసాలపై నటి విద్యా బాలన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. కొంత కాలంగా పరిశ్రమలో నటీమణుల జీతభత్యాల గురించి పెద్ద చర్చ నడుస్తుండగా.. చేస్తున్న పనికంటే తాము తక్కువ పారితోషికం తీసుకుంటున్నట్లు ఎంతోమంది బహిరంగానే ప్రకటించారు. అయితే వారందిరికీ భిన్నంగా స్పందించిన విద్య.. పెద్ద హీరోలతో పనిచేసిన సందర్భాలు తక్కువ కాబట్టి పేమెంట్ డిఫరెన్సెస్ గురించి తనకు పెద్దగా తెలీయదని చెప్పింది.

మెయిన్ స్ట్రీమ్ మూవీస్‌లోని స్టార్ నటీనటులు తమకు అందుతున్న దానికంటే 10 రెట్లు ఎక్కువ కావాలని డిమాండ్ చేసినప్పటికీ, తను పనిచేసిన ప్రాజెక్ట్‌ల్లో తగిన పరిహారమే లభిస్తుందని చెప్పింది. అయితే మహిళలకు వేతనం పెంచాలనే విషయం ఆరోగ్యకరమైన మార్గంగానే భావిస్తున్నప్పటికీ ప్రేక్షకుల ఆదరణకు అనుగుణంగా చెల్లించబడతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పింది. చివరగా సినిమాకు సంతకం చేసే ముందు ఏమి ఆశిస్తున్నారో దర్శకనిర్మాతలకు స్పష్టంగా చెప్పాలని సూచించింది.

Next Story

Most Viewed