రియల్ హీరో రణ్‌వీర్ ముందు ఏ ఫేక్ సింగ్ నిలబడలేరంటూ పూనమ్ పోస్ట్.. ఫైర్ అవుతున్న మెగా ఫ్యాన్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-23 12:52:07  IST  )

రియల్ హీరో రణ్‌వీర్ ముందు ఏ ఫేక్ సింగ్ నిలబడలేరంటూ పూనమ్ పోస్ట్.. ఫైర్ అవుతున్న మెగా ఫ్యాన్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధురంధర్-2’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఉగాది కానుకగా విడుదలైన ఈ చిత్రం కేవలం ప్రేక్షకులను మాత్రమే కాకుండా, ప్రశంసలను కూడా అందుకుంటూ కాసుల వర్షం కురిపిస్తోంది. అయితే, ఈ సినిమా సక్సెస్‌ను అభినందిస్తూ నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతోంది. పూనమ్ కౌర్ తన పోస్టులో రణ్‌వీర్ సింగ్‌ను ఆకాశానికెత్తుతూనే, ఇండైరెక్ట్‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. "ది రియల్ సింగ్ స్టోరీ.. రియల్ హీరో ‘ధురంధర్-2’ కోసం నేను పరిగెత్తుకుంటూ వెళ్లాను. బాక్సాఫీస్ ముందు ఏ 'ఫేక్ సింగ్' కూడా నిలబడలేరు" అంటూ ఆమె రాసుకొచ్చారు.

పూనమ్ వాడిన ‘ఫేక్ సింగ్’ అనే పదం పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను ఉద్దేశించిందేనని మెగా అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ‘ధురంధర్-2’కు పోటీగా విడుదలైన ఆ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. ఈ పరిస్థితిని సాకుగా చూపిస్తూ పూనమ్ కావాలనే పవన్‌ను టార్గెట్ చేశారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సింగ్ అంటే ఆమె పవన్ కళ్యాణ్ గురించే చెప్పిందని, పరోక్షంగా ఆయన వ్యక్తిత్వాన్ని, సినిమా క్రేజ్‌ను తక్కువ చేసే ప్రయత్నం చేసిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రణ్‌వీర్ మూవీ బాగుందని చెప్పడంలో తప్పు లేదు కానీ, అనవసరంగా మరో హీరోను ఇందులోకి లాగడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Next Story