- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
poonam kaur : ముంబై ఆడవాళ్లే కావాలా? మేము పనికిరామా?
ప్రముఖ నటి పూనమ్‌కౌర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తలో నిలిచింది. తరచూ ఏదో ఒక ఇష్యూతో సోషల్ మీడియా వేదికగా హంగామా చేసే పూనమ్ తాజాగా చిత్ర పరిశ్రమపై షాకింగ్ కామెంట్స్ చేసింది..

దిశ, సినిమా : ప్రముఖ నటి పూనమ్‌కౌర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తలో నిలిచింది. తరచూ ఏదో ఒక ఇష్యూతో సోషల్ మీడియా వేదికగా హంగామా చేసే పూనమ్ తాజాగా చిత్ర పరిశ్రమపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ మేరకు తాను ఇండస్ట్రీలో చాలా పనిచేయాలని కోరుకుంటానని, కానీ కొంతమంది తనను తొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ‘నాకు రెస్ట్ లేకుండా పని చేయాలనుంది. కానీ మేకర్స్ తమకు ఇష్టమైన హీరోయిన్‌లనే ఎంపిక చేసుకుంటున్నారు.
ముంబై నుంచి వచ్చిన అమ్మాయిల్లోనే యాక్టింగ్ టాలెంట్ ఉందా? తెలుగువారిలో లేదా? ఏ వేదిక మీదైనా తెలుగు కథానాయిక అంటే సావిత్రమ్మ పేరు చెబుతారు కదా! ఇప్పుడు ఎందుకు తెలుగు బిడ్డ, తెలుగు ఆర్టిస్ట్ అనే గౌరవం తగ్గిపోయింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇండస్ట్రీలో ఉన్న తెలుగు అమ్మాయిలను ఎదగనివ్వడం లేదు. ఎంకరేజ్ చేయడం లేదు. నా నేపథ్యం పంజాబ్ సిక్కు ఫ్యామిలీ అయినా నేను తెలంగాణాలోనే పుట్టి పెరిగాను.. ఇక్కడే చదివాను. దయచేసి నన్ను వేరు చేసి చూడకండి’ అంటూ చెప్పుకొచ్చింది.






