BRO : మంత్రి అంబటి వివాదంపై పూనమ్ కౌర్, వర్మ వైరల్ ట్వీట్స్..

by Dishanational2 |
BRO : మంత్రి అంబటి వివాదంపై పూనమ్ కౌర్, వర్మ వైరల్ ట్వీట్స్..
X

దిశ, సినిమా: రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ నటించిన ‘బ్రో’ మూవీ బ్లాక్ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. భారీ కలెక్షన్స్ రాబడుతోంది. అయితే ఈ మూవీలో శ్యామ్ బాబు అనే పాత్రను తనను అవమానించడానికే ప్రత్యేకంగా డిజైన్ చేశారంటూ ఏపీ మంత్రి అంబటి రాంబాబు రోజుకో ప్రెస్ మీట్ పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా నటి పూనమ్ కౌర్.. ‘రాజకీయాల్లో వినోదయం.. సినిమాల్లో సీరియస్‌నెస్ ఎక్కువైంది’ అని ట్వీట్ చేసింది. కానీ ఎవరి పేరు, ఎలాంటి ట్యాగ్ జోడించ లేదు. అయినప్పటికీ ఆమె పవన్ మూవీ వివాదం గురించే అలా ట్వీట్ చేసిందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అయితే మరో షాకింగ్ విషయం ఏంటంటే పూనమ్ కౌర్ ట్వీట్‌కి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. ఆమె ట్వీట్ ట్యాగ్ చేస్తూ..‘సిస్టర్ మీరు రాంగ్, నిజానికి రాజకీయాలు సినిమాగా.. సినిమాలు రాజకీయాలుగా మారాయి’ అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ అవుతుండగా.. మొత్తానికి ‘బ్రో’ వివాదంలో పూనమ్ కౌర్, రామ్ గోపాల్ వర్మ కూడా ఎంటర్ అయిపోయారు.

Read More: శ్యామ్ బాబు, రాంబాబు కాదంటూ క్లారిటీ ఇచ్చిన సాయిధరమ్ తేజ్


Next Story