- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అదిరిపోయే అప్డేట్ రాబోతుందంటూ పూజా హెగ్డే పోస్ట్..
ఈ పాటలో పూజా తన గ్రేస్‌ఫుల్ డాన్స్‌తో ప్రేక్షకులను మరోసారి మెస్మరైజ్ చేయబోతోందని సమాచారం.

దిశ, సినిమా: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం తన కెరీర్‌లో ఒక గట్టి హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తోంది. గత నాలుగేళ్లుగా ఆమెకు సరైన సక్సెస్ లేకపోయినా, ఆమె క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు బాలీవుడ్ మాస్ డైరెక్టర్ డేవిడ్ ధావన్ దర్శకత్వంలో రాబోతున్న ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వరుస పరాజయాల తర్వాత పూజా హెగ్డే ఇప్పుడు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో జతకట్టింది. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’. గత ఏడాది సూర్య సరసన నటించిన ‘రెట్రో’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని పూజా పట్టుదలతో ఉంది. ఈ సినిమాలో పూజాతో పాటు మరో టాలెంటెడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్, మౌనీ రాయ్, మనీష్ పాల్ కూడా కీలక పాత్రలో కనిపిస్తుండటం విశేషం.
అయితే ఈ చిత్రాన్ని ముందుగా జూన్ 5న విడుదల చేయాలనుకున్నారు, కానీ యష్ నటించిన ‘టాక్సిక్’ సినిమాతో పోటీ పడకూడదనే ఉద్దేశంతో దీనిని ఒక వారం వాయిదా వేసి జూన్ 12న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉండగా, మూవీ ప్రమోషన్లను మేకర్స్ స్పీడ్ పెంచారు. ఈక్రమంలో.. తాజాగా ఈ సినిమా మ్యూజికల్ జర్నీని ప్రారంభిస్తున్నట్లు తెలుపుతూ.. ఒక అదిరిపోయే సాంగ్ రాబోతున్నట్లు పూజా హెగ్డే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఈ పాటలో పూజా తన గ్రేస్‌ఫుల్ డాన్స్‌తో ప్రేక్షకులను మరోసారి మెస్మరైజ్ చేయబోతోందని సమాచారం. పూజా హెగ్డే ఈ సినిమాలో చాలా గ్లామరస్‌గా, చురుకైన పాత్రలో కనిపిస్తుందట. వరుస ఫ్లాపుల్లో ఉన్న పూజాకు ఈ ‘హై జవానీ’ ఒక గ్రాండ్ కమ్ బ్యాక్ ఇస్తుందని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు.






