- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pooja Hegde: స్టార్ హీరో మూవీలో చాన్స్ కొట్టేసిన పూజా హెగ్డే
స్టార్ హీరో మూవీలో ఛాన్స్ కొట్టేసిన పూజా హెగ్డే

దిశ, సినిమా: పూజా హెగ్డే (Pooja Hegde) ఒకప్పుడు టాలీవుడ్ నే ఓ ఊపు ఉపేసింది. ఈ ముద్దుగుమ్మ కోసం స్టార్ హీరోలు కూడా డేట్స్ కోసం వెయిట్ చేసేవాళ్లు. ఈ మధ్య కాలంలో ఈ బుట్టబొమ్మ జోరు తెలుగులో తగ్గింది. వరుస హిట్స్ అందుకున్న పూజా .. ఇప్పుడు వరుసగా ఫ్లాపులు రావడంతో పూజా హెగ్డేను తెలుగు మేకర్లు అంతగా పట్టించుకోవడం లేదు.
తమిళంలోనూ ఈ ముద్దుగుమ్మకు అంతగా ఆఫర్లు రావడం లేదనిపిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్‌లోనే ఆఫర్లు వస్తున్నాయి. సల్మాన్ ఖాన్‌తో చేసిన మూవీ డిజాస్టర్ అయింది. విజయ్ బీస్ట్ కూడా హిట్ అందుకోకపోవడంతో పూర్తిగా ఆఫర్లు తగ్గిపోయాయి. తెలుగులో బుట్టబొమ్మ పేరు విని చాలా కాలం అవుతుంది. తాజాగా, స్టార్ హీరో మూవీలో పూజా హెగ్డే బంపర్ ఆఫర్ కొట్టేసిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అక్కినేని నాగచైతన్య హీరోగా విరూపాక్ష దర్శకుడు కార్తిక్ దండు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ మూవీలో హీరోయిన్‌గా పూజా హెగ్డేని ఫిక్స్ ఒకే చేసినట్టు సమాచారం. ఇదే నిజమైతే, తెలుగులో నాగచైతన్య, పూజా జతకట్టడ కట్టడం ఇది రెండో సారి. ప్రస్తుతం బాలీవుడ్‌లో రెండు ప్రాజెక్టులు చేస్తుంది.
- Tags
- Pooja Hegde






