- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన పూజా హెగ్దే.. ఈ సడెన్ ట్విస్ట్ ఎంట్రా బాబు!
స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే ప్రజంట్ ఒక భారీ హిట్ కోసం ఎదురుచూస్తోంది.

దిశ,సినిమా: స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే ప్రజంట్ ఒక భారీ హిట్ కోసం ఎదురుచూస్తోంది. కొంతకాలంగా వరుస ఫ్లాప్‌లు ఎదుర్కొంటున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి సల్మాన్‌తో జతకట్టినప్పటికీ హిట్ మాత్రం కొట్టలేకపొయింది. అయితే ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఫేమ్ తగ్గకుండా ఉండేందుకు ప్రతి హీరోయిన్ నానా తంటాలు పడుతున్నారు. ఎలాంటి క్యారెక్టర్ చేయడానికైనా సిద్ధంగా ఉంటున్నారు. ఇందుకు తమన్ననే నిదర్శనం. తాజాగా పూజా కూడా షాకింగ్ నిర్ణయం తీసుకుందట. రీసెంట్‌గా తన పుట్టినరోజును మాల్దీవ్స్‌లో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్న ఆమె అక్కడే మూడురోజులపాటు ఎంజాయ్ చేసింది. ఇలాంటి క్రమంలోనే పుట్టినరోజు తర్వాత పూజ చాలా బోల్డ్ డెసిషన్ తీసుకుందనే వార్త వైరల్ అవుతుంది. ఇప్పటివరకు కొన్ని సీన్స్ చేయకూడదని రూల్స్ పెట్టుకున్న ఆమె.. ఇకపై హద్దులు చెరిపేస్తుందట. ఆఫర్స్ రాకపోవడంతో వెబ్ సిరీస్‌లోనూ నటించేందుకు రెడీ అవుతుందట.






