- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pooja Hegde: స్టార్ హీరో విజయ్ ‘జన నాయగన్’ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చిన పూజా హెగ్డే..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde)సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇటీవల రెట్రో, దేవా వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde)సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇటీవల రెట్రో, దేవా వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ చిత్రాలు బాక్సాఫీసు వద్ద మెప్పించలేకపోయాయి. ప్రస్తుతం పూజా హెగ్డే హిట్, ఫ్లాప్ అని పట్టించుకోకుండా వచ్చిన అవకాశాలు ఒప్పుకుంటోంది. ప్రజెంట్ ఈ అమ్మడు దళపతి విజయ్(Thalapathy Vijay) ‘ జననాయగన్’(Jananayagan) మూవీలో కీలక పాత్రలో నటిస్తోంది. హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిస్తుండగా.. దీనిని కె.వి. ఎన్ ప్రొడక్షన్ బ్యానర్‌పై లోహత్, యగదీష్, పళనిస్వామి నిర్మి్స్తున్నారు. అయితే ఈ చిత్రంలో బాబీ డియోల్, మమితా బైజు(Mamita Baiju), ప్రియమణి, శృతిహాసన్, నరేన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్(Gautam Vasudev Menon), ప్రకాష్ రాజ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్స్‌లోకి రాబోతుంది. అయితే విజయ్ చివరి మూవీ కావడంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఇదిలా ఉంటే.. తాజాగా, పూజా హెగ్డే ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చింది. జననాయగన్ సినిమాలో తన సీన్స్‌కు సంబంధించిన షూటింగ్ పూర్తయిందని తెలిపింది. అంతేకాకుండా ఓ ఫొటోను కూడా షేర్ చేసింది. అయితే ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ జూన్ 21న విజయ్ పుట్టినరోజు కానుకగా రాబోతున్నట్లు సమాచారం. ఇక ఈ విషయం తెలుపుకున్న విజయ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సారి ఫుల్ మీల్స్ ఇవ్వనున్నారు కావచ్చు అని అభిప్రాయపడుతున్నారు.






