PS2 : 100 కోట్ల క్లబ్‌లో ‘పొన్నియిన్ సెల్వన్ 2’

by Disha Web Desk 9 |
PS2 : 100 కోట్ల క్లబ్‌లో ‘పొన్నియిన్ సెల్వన్ 2’
X

దిశ, సినిమా: దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన పీరియాడిక్ చిత్రం ‘పొన్నియన్ సెల్వన్ 2’. విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష, కార్తీ, జయం రవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు నుంచి ప్రపంచవ్యాప్తంగా సంచలన రీతిలో కలెక్షన్లు సాధిస్తోంది. పార్ట్ 1 తో పోలిస్తే తక్కువ ఓపెనింగ్స్ అనుకున్నప్పటికీ, రెండో రోజు నుంచి భారీ రీచ్‌ అందుకుంది. తాజా అప్ డేట్ ప్రకారం జస్ట్ రెండు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 100 కోట్లు రాబట్టింది. అయితే మొదటి భాగం సుమారు రూ. 600 కోట్లకి పైగా రాబట్టగా.. మరి ఈ రెండో భాగం మరెన్ని వసూళ్లు సాధిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

150 మంది పిల్లల దత్తత.. తాజాగా రాఘవ లారెన్స్ మరో అనౌన్స్‌మెంట్‌

Next Story

Most Viewed