పవర్ స్టార్ ఫ్యాన్స్ రచ్చ.. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోవాలంటూ హరీష్ శంకర్ రిక్వెస్ట్

by Mallepaka Hamsa |

టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ కాంబినేషన్ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్(Harish Shankar) అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

పవర్ స్టార్ ఫ్యాన్స్ రచ్చ.. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోవాలంటూ హరీష్ శంకర్ రిక్వెస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ కాంబినేషన్ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్(Harish Shankar) అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. గతంలో ‘గబ్బర్ సింగ్’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ కాంబో, ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’(Ustad Bhagat Singh) కోసం మళ్లీ చేతులు కలపడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌లో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. చాలా కాలంగా ఈ సినిమా నుంచి సరైన అప్‌డేట్ లేకపోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా దర్శకుడు హరీష్ శంకర్‌ను ట్యాగ్ చేస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నిత్యం వందల సంఖ్యలో వస్తున్న పోస్టులు, ట్యాగ్‌లను గమనించిన హరీష్ శంకర్.. తాజాగా దీనిపై స్పందించి ఫ్యాన్స్‌కు క్లారిటీ ఇచ్చారు. అభిమానుల ఆత్రుతను తాను అర్థం చేసుకోగలనని, అయితే ప్రతి అప్‌డేట్‌కు ఒక సరైన సమయం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

మమ్మల్ని నమ్మండి.. సెలబ్రేషన్స్ లోడింగ్.. అన్ని అప్‌డేట్స్ త్వరలోనే రాబోతున్నాయి. ఒక సినిమా మేకింగ్ ప్రాసెస్ వెనుక ఎంతో కష్టం ఉంటుంది. దయచేసి దానిని అర్థం చేసుకోండి. మమ్మల్ని నమ్మండి, మేము ఇచ్చే ప్రతి అప్‌డేట్‌ను మీరు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు’’ అని హరీష్ శంకర్ రాసుకొచ్చారు. ఆయన చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి త్వరలోనే అదిరిపోయే వీడియో లేదా పోస్టర్ రాబోతుందనే విషయం తెలుసుకున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం, పవన్ కళ్యాణ్ మార్క్ మాస్ ఎలిమెంట్స్ , హరీష్ శంకర్ పవర్ ఫుల్ డైలాగ్స్‌తో ఉండబోతున్నట్లు సమాచారం. దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్న ఈ సినిమా మార్చి 26న థియేటర్స్‌లోకి రాబోతుంది.

Next Story