- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దయచేసి హీరోయిన్లను వస్తువుల్లా చూపించే ప్రయత్నాలు ఆపండి.. సప్తమి గౌడకు సపోర్ట్‌గా శివరాజ్ కుమార్
మహిళలను గౌరవించడం అనేది మనందరి ప్రాథమిక బాధ్యత.

దిశ, సినిమా: కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల ఆత్మగౌరవం, భద్రతపై ప్రస్తుతం ఒక పెద్ద ఉద్యమం మొదలైంది. సినీ వేడుకలలో కొంతమంది ఫోటోగ్రాఫర్లు, కెమెరామెన్లు హీరోయిన్ల శరీర భాగాలను జూమ్ చేస్తూ, వారిని అసౌకర్యానికి గురిచేయడంపై నటీమణులు ఒక్కటిగా నిలిచి నిరసన మొదలెట్టారు. దీనికి సంబంధించి సప్తమి గౌడ ప్రారంభించిన పోరాటం ఇప్పుడు సౌత్ ఇండియాలో హాట్ టాపిక్‌గా మారింది. ‘కాంతార’ ఫేమ్ సప్తమి గౌడ ఇటీవల సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను పంచుకున్నారు. సినిమా ఈవెంట్లలో హీరోయిన్లు పాల్గొన్నప్పుడు, కెమెరాలను వారి శరీరాలపై అసభ్యకరంగా జూమ్ చేసి ఫోటోలు తీయడం, వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేయడంపై ఆమె మండిపడ్డారు. ‘మమ్మల్ని కేవలం వస్తువుల్లా చూడకండి, కళాకారులుగా గౌరవించండి’ అంటూ ఆమె ఇచ్చిన పిలుపునకు భారీ మద్దతు లభిస్తోంది.
#ActorsNotObjects అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆమె మొదలుపెట్టిన ఈ ఉద్యమానికి ఇతర హీరోయిన్లు ఆషికా రంగనాథ్, రుక్మిణి వసంత్ కూడా మద్దతు ప్రకటించి, తాము ఎదుర్కొన్న ఇబ్బందులను బయటపెట్టారు. తాజాగా, ఈ వివాదంపై కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ స్పందించడం విశేషం. సప్తమి గౌడకు అండగా నిలుస్తూ ఆయన ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. "మహిళలను గౌరవించడం అనేది మనందరి ప్రాథమిక బాధ్యత. సినిమా రంగంలో ఉన్న మహిళలను కేవలం వస్తువుల్లా చూపించే ప్రయత్నాలను వెంటనే ఆపాలి. ఇలాంటి ప్రవర్తన ఏమాత్రం సమర్థనీయం కాదు" అని ఆయన ఘాటుగా స్పందించారు.
శివరాజ్ కుమార్ కుమార్తె, నిర్మాత నివేదిత రాజ్ కుమార్ కూడా ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. మహిళలను కేవలం శరీరంగా మాత్రమే చూడటం అనేది సమాజంలో పెరిగిపోతున్న దిగజారుడు ధోరణికి నిదర్శనమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. "ఒక నటిగా కాకుండా, ఒక వస్తువుగా చిత్రీకరించడం వెనుక ఉన్న వికృత మనస్తత్వాన్ని సమాజం సహించకూడదు" అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలబ్రిటీల నుంచి వస్తున్న ఈ మద్దతుతో ఫోటోగ్రాఫర్ల తీరుపై ఇండస్ట్రీలో చర్చ మొదలైంది.






