ప్లీజ్ ఒక్క చాన్స్ ఇవ్వండి.. ఓపెన్‌గా అడిగేసిన పవన్ కల్యాణ్ హీరోయిన్

by Disha Web Desk 6 |
ప్లీజ్ ఒక్క చాన్స్ ఇవ్వండి.. ఓపెన్‌గా అడిగేసిన పవన్ కల్యాణ్ హీరోయిన్
X

దిశ, సినిమా: కెరీర్ మొదట్లో స్టార్ హీరోలతో జతకట్టిన కొంతమంది హీరోయిన్లు, హిట్ అందుకున్నప్పటికీ తర్వాత అవకాశాలు లభించవు. అలా ఒకటి రెండు సినిమాల్లో మెరిసిన చాలా మంది ఇప్పుడు ప్లీజ్ ఒక్క చాన్స్ అంటూ అడుక్కునే స్థితికి వచ్చారు. అలాంటి వారిలో మీరా చోప్రా ఒకరు. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘బంగారం’ మూవీలో హీరోయిన్‌గా నటించిన ఈ ముద్దుగుమ్మ తర్వాత ‘వాన’ మూవీలోనూ తళుక్కుమంది.

ఇక చాలా కాలం తర్వాత తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వైరల్ కామెంట్స్ చేసింది మీరా.‘చాన్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి నా కాళ్లు అరిగిపోయాయి. కానీ అన్నింటినీ అధిగమించి ముందుకు వెళ్లాలనుకుంటున్నా. ప్లీజ్ నాకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వండి. నటిగా నేనేంటో నాకూ తెలుసు.. మీకూ తెలుసు.. అందుకే ఓపెన్‌గా రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు మంచి పాత్రలు ఇవ్వండి. ఏదైనా ఉంటే నాకు ఒకసారి కాల్ చేయండి’ అంటూ వేడుకుంది. ప్రజెంట్ ఈ అమ్మడు మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



Next Story

Most Viewed