- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దయచేసి నాకు ఎక్కువ సినిమాల్లో అవకాశాలు ఇవ్వండి.. టాలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్
ఈ సినిమాలో శర్వానంద్ మెయిన్ హీరో అయితే, నేను సెకండ్ హీరోగా చేస్తున్నాను.

దిశ, సినిమా: ఒకప్పుడు టాలీవుడ్‌లో యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న సీనియర్ హీరో రాజశేఖర్, ఇప్పుడు సరికొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆరోగ్య సమస్యల కారణంగా కొంతకాలం వెండితెరకు దూరమైన ఆయన, ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. యంగ్ హీరో శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘బైకర్’ (Biker). అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజశేఖర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా, ఈ చిత్ర ట్రైలర్ విడుదల కాగా, దానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. తన మనసులోని బాధను, నిజాన్ని ఆయన నిర్మొహమాటంగా పంచుకున్నారు."ఈ సినిమాలో శర్వానంద్ మెయిన్ హీరో అయితే, నేను సెకండ్ హీరోగా చేస్తున్నాను. నిజం చెప్పాలంటే.. 'అయ్యో, నేను సెకండ్ లెవెల్‌కు పడిపోయానా?' అనే చిన్న బాధ నాలో కలిగింది.
ఒకప్పుడు సోలో హీరోగా వెలిగిన నాకు ఇది కొంచెం కష్టంగా అనిపించింది. కానీ మా పిల్లలు (శివాని, శివాత్మిక) నన్ను ఒప్పించారు. ఇప్పుడు నేను ఈ పరిస్థితులకు అలవాటు పడిపోయాను (అడ్జస్ట్ అయ్యాను)" అని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, దర్శక నిర్మాతలకు ఆయన ఒక విన్నపం కూడా చేశారు. "నన్ను ఆదరించండి.. నాకు మరిన్ని సినిమాల్లో నటించే అవకాశం ఇవ్వాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను" అని కోరారు. రాజశేఖర్ లాంటి సీనియర్ స్టార్ ఇలా ఓపెన్‌గా తన మనసులోని మాట చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మాళవికా నాయర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా పక్కా యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా రాబోతోంది. రాజశేఖర్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ రోల్స్‌తో మెప్పిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.






