- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఉస్తాద్ భగత్‌సింగ్’ విషయంలో దయచేసి అలాంటి పనులు చేయకండి.. కీలక ప్రకటన విడుదల చేసిన మూవీ టీమ్
గత కొద్ది కాలంగా స్టార్ హీరోల సినిమాల షూటింగ్స్ నుంచి పలు ఫొటోలు, వీడియోలు లీక్ అవుతున్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా స్టార్ హీరోల సినిమాల షూటింగ్స్ నుంచి పలు ఫొటోలు, వీడియోలు లీక్ అవుతున్న విషయం తెలిసిందే. దర్శక నిర్మాతలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ చేసినప్పటికీ లీకుల బెడద తప్పడం లేదు. ఇటీవల చిరంజీవి ‘మెగా-157’ నుంచి పలు ఫొటోలు లీక్ కావడంతో జాగ్రత్త పడిన మూవీ టీమ్ కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో స్టార్ హీరో పవన్ కల్యాణ్(Pawan Kalyan) ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ (Ustad Bhagat Singh)సినిమాకు సంబంధించిన షూటింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.
తాజాగా, ఈ విషయంపై మూవీ టీమ్ స్పందించి కీలక నోట్ విడుదల చేసింది. ‘‘ఉస్తాద్ భగత్‌సింగ్ సెట్ నుండి లీక్ అయిన చిత్రాలను అనేక ఖాతాల నుంచి షేర్ చేస్తూ వైరల్ చేయడం మేము గమనించాము. దయచేసి అలాంటి మేము మీ ఉత్సాహాన్ని అర్థం చేసుకున్నాము. కానీ దయచేసి వాటిని షేర్ చేయకుండా ఉండండి. అలా చేశారో కఠిన చర్యలు తీసుకుంటాము. మీకు ఉత్తమ అనుభవాన్ని అందించడానికి మేము కృషి చేస్తున్నాము’’ అని రాసుకొచ్చారు.
కాగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్(Harish Shankar) కాంబోలో రాబోతున్న మూవీ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. సాక్షి వైద్య, అశుతోష్ రానా, గౌతమి, నాగ మహేష్, టెంపర్ వంశీ, కేజీఎఫ్ అవినాష్ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.






