- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దయచేసి నా ఇంటి ముందుకు రాకండి.. ఫ్యాన్స్‌కు కీలక విజ్ఞప్తి చేస్తూ కిచ్చాసుదీప్ ఎమోషనల్ పోస్ట్
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్(Kiccha Sudeep) ‘బిల్లా రంగా బాషా’(Billa Ranga Basha) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్(Kiccha Sudeep) ‘బిల్లా రంగా బాషా’(Billa Ranga Basha) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. అనూప్ బండారి(Anup Bhandari) దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, కిచ్చా సుదీప్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు కీలక విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ 2న తన పుట్టినరోజు నాడు తన ఇంటిముందుకు వచ్చి నానా రబస చేయోద్దని హెచ్చరించాడు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ‘‘ప్రియమైన మిత్రులారా సెప్టెంబర్ 2 ఉదయం కాదు రాత్ర 1 గంటలకు కలుద్దాం. సెప్టెంబర్ 2న మీరు నన్ను కలవడానికి ఎంతగానో వేచి ఉంటారో దానికంటే ఎక్కువగా నేను మీకోసం ఎదురు చూస్తాను.
మీ వేడుకలకు సంబంధించిన వీడియోలను నేను చూసిన ప్రతిసారి.. తిరిగి జన్మించినట్లుగా అనిపిస్తుంది. నిస్సందేహంగా చెప్తున్నాను.. అది నాకు సంతృప్తికరంగా ఉంటుంది. అందుకే దశాబ్దాలుగా నా ఇంటి దగ్గర మిమ్మల్ని కలిసిన ప్రతిసారీ నేను నా పుట్టిన రోజును జరుపుకుంటాను. కానీ ఈ సారి ఇది చాలా కష్టం. ఎందుకంటే నా తల్లి లేని మొదటి సంవత్సరం నా తల్లి లేకుండా ఈ వేడకను ఊహించుకోవడం నాకు కష్టంగా అనిపిస్తుంది. కానీ నేను మిమ్మల్ని నిరాశపరచకూడదనుకుంటున్నాను. అందుకే నా పుట్టినరోజు 12 గంటలకు మీ శుభాకాంక్షలు మాత్రమే నాకు వినిపించాలని కోరుకుంటున్నా.
నేను లేచి వెళ్ల లేను కాబట్టి.. సెప్టెంబర్ 1న రాత్రి అందరం కలిసి సమావేశమవుదాం. ఎక్కడ అనేది నేను మీకు చెప్తాను. కానీ మరుసటి రోజు మాత్రం సెప్టెంబర్ 2న దయచేసి నా ఇంటి దగ్గరకు రాకండి. నేను ఆ రోజు ఇంట్లో ఉండను. నేను అక్కడ ఉండను అని చెప్పిన తర్వాత కూడా మీరు అక్కడికి వచ్చి గొడవలు చేయకండి. అది నా హృదయాన్ని బాధపెడుతుంది. అలాగే నా తల్లి లేకుండా ఇది మొదటి సంవత్సరం కాబట్టి ప్రశాంతత వాతావరణం ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు నన్ను నేను చెప్పింది వింటారని నేను నమ్ముతున్నాను. నేను నిరాశ చెందను ప్రతి సంవత్సరం లాగే సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తాను. మీ శుభాకాంక్షలు, ప్రశంసలు నాకు గొప్ప ఆస్తులుగా భావిస్తాను’’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం కిచ్చా సుదీప్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






