- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దయచేసి ఆ వార్తలు నమ్మకండి.. మీడియాపై ఫైర్ అవుతూ అక్షయ్ కుమార్ పోస్ట్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈక్రమంలో ఆయన ఓ సినిమాలో వాల్మికి మహర్షి పాత్రలో నటిస్తున్నట్లు ఏఐతో క్రియేట్ చేసిన పలు వీడియోలు వస్తున్నాయి. ఇక అది చూసిన అక్షయ్ కుమార్ ఫుల్ ఫైర్ అయ్యాడు. ట్విట్టర్ ద్వారా ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ కీలక నోట్ రిలీజ్ చేశారు. ‘‘గత కొద్ది కాలంగా కొన్ని తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి. దీనిపై నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. నేను మహర్షి వాల్మీకి పాత్రలో నటిస్తున్నట్లు.. ట్రైలర్ కూడా విడుదలైనట్లు కొన్ని వీడియోలను చూశాను. అవి AIని ఉపయోగించి సృష్టించబడ్డాయని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను.
అవన్నీ ఫేక్ దయచేసి మీరు నమ్మకండి. దారుణమైన విషయం ఏమిటంటే.. కొన్ని వార్తా ఛానెల్‌లు ఇవి నిజమైనవా లేదా మార్ఫింగ్ చేయబడినవా అని కూడా ధృవీకరించకుండా వార్తలు రాశారు. నేటి కాలంలో, మోసపూరిత AI ద్వారా తప్పుదారి పట్టించే కంటెంట్ చాలా వేగంగా ఉత్పత్తి అవుతుంది. నిజమైన వాటికంటే అవే ఎక్కువ వేగంగా వైరల్ అవుతున్నాయి. దీనిని గమనించాలని అభ్యర్థిస్తున్నాను. ఏదైనా సమాచారాన్ని షేర్ చేసే ముందు దాన్ని పరిశీలించాలని కోరుతున్నా. వాస్తవాన్ని మాత్రమే ప్రజలకు అందించాలని మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని రాసుకొచ్చారు. కానీ ఆ సినిమా పేరును మాత్రం రివీల్ చేయలేదు. దీంతో ఈ పోస్ట్ చూసిన వారంతా ‘రామాయణ’ గురించే అని చర్చించుకుంటున్నారు.






