- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దయచేసి అలాంటివి నమ్మకండి.. అభిమానులకు కీలక విజ్ఞప్తి చేసిన ధనుష్
కోలీవుడ్ స్టార్ ధనుష్ (Dhanush)స్వయం దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ఇడ్లీ కడై’.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ ధనుష్ (Dhanush)స్వయం దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ఇడ్లీ కడై’. తెలుగులో ఇడ్లీ కొట్టు పేరుతో విడుదల కాబోతుంది. వెరైటీ టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రంలో నిత్యామీనన్(Nithya Menon) హీరోయిన్‌గా కనిపించనుంది. అరుణ్ విజయ్ కీలక పాత్రలో నటిస్తుండగా.. షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఇడ్లీ కడై’ (Idli Kadai)అక్టోబర్ 1న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈక్రమంలో.. ప్రమోషన్స్ జోరు పెంచిన ధనుష్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో పాల్గొన్న ధనుష్ మాట్లాడుతూ.. ‘‘నేను జగమే తంధిరం చిత్రంలో పరోటా కాల్చాను. తిరుచిత్రంబలం సినిమాలో డెలివరీ బాయ్‌గా పనిచేశాను. రాయన్ పట్టాలో ఫాస్ట్ ఫుడ్ దుకాణాన్ని తెరిచాను. ఈ IdlyKadai సినిమాలో ఇడ్లీని కాల్చుతున్నాను.
ఇవన్నీ ప్రేక్షకులను అలరించడానికే చేశాను. కానీ జనాలు థియేటర్స్‌కు రావడం లేదు. ఒక సినిమా ఉదయం 9 గంటలకు విడుదలవుతుంటే.. కొన్ని ఉదయం 8 గంటలకే నెగిటివ్ రివ్యూలు వస్తాయి. వాటిని నమ్మవద్దు. మిమ్మల్ని మీరు చూసి సినిమాలు అంచనా వేయండి. మీ స్నేహితుల మాటలు నమ్మి చిత్రం చూడకుండా ఉండకండి. మీరు చూసి నిర్ణయించుకోండి.. ఈ రోజు సినిమా పరిశ్రమకు అది అవసరం.. ప్రతి సినిమా బాగా నడవాలంటే అది మీ చేతుల్లో ఉంది.. దయచేసి నెగిటివ్ రివ్యూలు నమ్మకండి.. మీరు థియేటర్స్‌కి వెళ్లి సినిమా చూడండి ప్లీజ్’’ అని చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.






