దయచేసి ఎటువంటి ఆధారం లేని పుకార్లను నమ్మకండి: సాయి ధరమ్ తేజ్

by Mallepaka Hamsa |

సాధారణంగా హీరోలు ఒకే సినిమా చేస్తున్నప్పటికీ తన తదుపరి ప్రాజెక్ట్ పలానా దర్శకుడితో చేస్తున్నారంటూ వార్తలు రావడం కామన్.

దయచేసి ఎటువంటి ఆధారం లేని పుకార్లను నమ్మకండి: సాయి ధరమ్ తేజ్
X

దిశ, సినిమా: సాధారణంగా హీరోలు ఒకే సినిమా చేస్తున్నప్పటికీ తన తదుపరి ప్రాజెక్ట్ పలానా దర్శకుడితో చేస్తున్నారంటూ వార్తలు రావడం కామన్. లేదా అసలు ముందు ఒప్పుకున్న చిత్రాన్ని ఆపేసి మరి కొత్త ప్రాజెక్ట్ కోసం పని చేసే హీరోలు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. షూటింగ్ ఆగిపోకుండా.. లేదా పలు కారణాల వల్ల అలా చేస్తుంటారు. అయినప్పటికీ ఏదో జరగడం వల్లే అలా చేస్తున్నారంటూ పలు పుకార్లు షికారు చేస్తుంటాయి. తాజాగా, మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) విషయంలోనూ అదే జరిగింది. ప్రస్తుతం ఆయన ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. దీనిని రోహిత్ కేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

చైతన్య రెడ్డి, నిరంజన్ రెడ్డి ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ మంచి క్రియేట్ చేయగా.. షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఇంకా రెండు షెడ్యూల్స్ షూట్ చేస్తే షూట్ పూర్తవుతుందని తెలుస్తోంది. ఈనేపథ్యంలో.. తాజాగా, ‘సంబరాల ఏటిగట్టు’ (SambaralaYetiGattu )షూటింగ్‌కు బ్రేక్ పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక వాటిని చూసిన అభిమానుల్లో ఆందోళన మొదలైంది. పాన్ ఇండియా సినిమాను డిలే చేసి రిస్క్ తీసుకుంటున్నాడని చర్చించుకుంటున్నారు.

అయితే సాయి ధరమ్ తేజ్ తన తదుపరి సినిమా ‘రిపబ్లిక్-2’ ఫైనల్ చేశాడని షూట్ కూడా మొదలు పెట్టబోతున్నట్లు పుకార్లు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో.. సాయి ధరమ్ టీమ్‌ను సంప్రదించగా.. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ‘‘ప్రస్తుతానికి సాయి ధరమ్ తేజ్ ఫోకస్ అంతా సంబరాల ఏటిగట్టు మీదనే ఉంది. ఈ సినిమా పూర్తయిన తర్వాతనే ఏదైనా ప్రాజెక్ట్ చేస్తారు. ఒకవేళ చేస్తే అఫీషియల్‌గా ఆయన కానీ లేదా మేము కానీ అనౌన్స్ చేస్తాము. దయచేసి ఎటువంటి ఆధారం లేని రూమర్స్‌ను నమ్మవద్దని కోరుతున్నాం’’ అని చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో మెగా హీరో ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు.

link

Next Story