- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నచ్చని వ్యక్తిగా నటించడం ఒక పెద్ద సవాలు.. ఆ పాత్రతోనే ప్రయోగం చేస్తా: సాన్యా మల్హోత్రా
కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకువచ్చే అద్భుతమైన దర్శకులతో పనిచేయడం తన అదృష్టమని చెప్పింది.

దిశ, సినిమా: బాలీవుడ్ నటి సాన్యా మల్హోత్రా (Sanya Malhotra)రీసెంట్‌గా జరిగిన ఒక సమ్మిట్‌లో సోషల్ మీడియా తీరుపై తన మనసులోని మాటను బయటపెట్టింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏ విషయం కూడా సీరియస్‌గా ఉండటం లేదని, అంతా గందరగోళంగా మారిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఎవరైనా ఏదైనా మంచి పాయింట్ చెప్పినా, దాన్ని వినే ఓపిక ప్రజలకు లేదని.. ఏదైనా సరే కొన్ని రోజులు, లేదా కొన్ని గంటల్లోనే అందరూ మర్చిపోతున్నారని సాన్యా పేర్కొంది. ముఖ్యమైన సామాజిక సమస్యలు కూడా సోషల్ మీడియా అల్గారిథమ్‌లో పడి ఎక్కడో కలిసిపోతున్నాయని, ప్రజల్లో ఒకరిపై ఒకరికి ఉండాల్సిన జాలి, దయNegative roles తగ్గిపోవడం నిజంగా భయపెట్టే విషయమని ఆమె వివరించింది. నటిగా తన కెరీర్ గురించి వివరిస్తూ.. భవిష్యత్తులో తనకు అస్సలు నచ్చని ఒక నెగటివ్ క్యారెక్టర్‌లో నటించాలని ఉందని సాన్యా వెల్లడించింది.
ఒక నటిగా ప్రతి పాత్రతోనూ మమేకం కావాల్సి ఉంటుందని, అందుకే తనకు నచ్చని వ్యక్తిగా నటించడం ఒక పెద్ద సవాలు అని ఆమె అభిప్రాయపడింది. తనను కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకువచ్చే అద్భుతమైన దర్శకులతో పనిచేయడం తన అదృష్టమని, రాబోయే రోజుల్లో రాజ్‌కుమార్ రావు(Rajkumar Rao)తో కలిసి 'టోస్టర్' అనే క్రేజీ ప్రాజెక్టులో కనిపించబోతున్నట్లు ఆమె తెలిపింది. ప్రస్తుతం సాన్యా మల్హోత్రా అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో బాబీ డియోల్‌తో కలిసి ‘బందర్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. మే 22న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతోంది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక స్టార్ నటుడి కథాంశంతో, మన న్యాయవ్యవస్థలోని లోపాలను, అణిచివేసిన గొంతులను ఈ సినిమా ప్రతిబింబించబోతోంది. సామాజిక స్పృహతో సాన్యా చేస్తున్న ఈ ప్రయోగాత్మక చిత్రంపై ప్రస్తుతం సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.






