వైద్యులతో ఫొటో... మహేశ్‌కు ఏమైనట్టు..?

by Disha Web Desk 1 |
వైద్యులతో ఫొటో... మహేశ్‌కు ఏమైనట్టు..?
X

దిశ, వెబ్ డెస్క్: ఆశేష తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానులు చూరగొన్న ఘనత సూపర్ స్టార్ ప్రిన్స్ మహష్ బాబు సొంతం. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ దర్వకత్వంలో 'ఎస్ఎస్ఎంబీ28' చిత్రం చేస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసుకుని, కుటుంబంతో కలిసి జర్మనీ టూర్ కు వెళ్లారు. ఇక్కడికి బాగానే ఉన్న ఇన్ స్టాగ్రామ్ లో ఆయన చేసిన పోస్ట్ తన అభిమానులను కలవరపెడుతోంది.

ఆరోగ్యం గురించి ఆయన పెట్టిన పోస్ట్ తో ఆయనకు ఏమైందంటూ సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. డాక్టర్‌ హ్యారీ కోనిగ్‌తో దిగిన ఓ ఫోటోను షేర్‌ చేసి ‘థ్యాంక్యూ డాక్టర్‌ హ్యారీ కోనిగ్‌! ఆరోగ్యం పట్ల ఉదాసీనత పనికి రాదు. సంరక్షకుడు లేకపోతే ఆరోగ్యం లేదు. జాగ్రత్తగా ఉంటేనే మెరుగైన ఆరోగ్యం మీచేతుల్లో’ అని అర్ధం వచ్చేలా మహేశ్‌ చేసిన పోస్ట్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఇది చూసి మహేశ్‌కు ఏమైంది? ఆయన అస్వస్థతకు గురైతే డాక్టర్‌ హ్యారీ నయం చేశారా అంటూ ఫ్యాన్స్‌ కామెంట్లు పెడుతున్నారు. కొందరైతే భయపడాల్సింది ఏమీ లేదంటూ పోస్ట్‌లు చేస్తున్నారు. డాక్టర్‌ హ్యారీ కోనిగ్‌ నేచురోపతి వైద్యులు. చాలాకాలంగా ఆయన ఆధ్వర్యంలో మహేశ్‌ చికిత్స తీసుకుంటున్నాడు.

Also Read

సమంత-చైతన్య విడిపోవడమే శాపమైందా.. ఇద్దరికీ ప్లాపులే!

Next Story

Most Viewed