వరుణ్ పెళ్లిలో.. పాపం శ్రీజ ఒక్కతే అలా ఉండిపోయింది?

by Disha Web Desk 10 |
వరుణ్ పెళ్లిలో.. పాపం శ్రీజ ఒక్కతే అలా ఉండిపోయింది?
X

దిశ, సినిమా: నవంబర్ 1న వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల వివాహ వేడుక ఇటలీలో ఘనంగా జరిగింది. దాదాపు 6 సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట పెద్దల సమక్షంలో పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇక వివాహ వేడుకలు పూర్తికావడంతో తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు మెగా ఫ్యామిలీ. హైదరాబాద్‌లో టాలీవుడ్ సెలబ్రిటీలు అందరిని కూడా ఆహ్వానించి ఘనంగా రిసెప్షన్ నిర్వహించబోతున్నారు. కాగా ఈ రిసెప్షన్‌కు ఎవరెవరు వస్తారో చూడాలి. అయితే తాజాగా సోషల్ మీడియాలో శ్రీజకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది.

పెళ్లి కాగానే ఈ వేడుకకు సంబంధించిన ఫొటో, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఒక ఫొటో వైరల్ అవుతుంది. అందులో చిరు, చరణ్, నాగబాబు, అల్లు అర్జున్ అందరూ వారి భార్యలతో జంటగా కనిపించగా శ్రీజ మాత్రమే ఒంటరిగా కనిపించింది. దీంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘ఈ ఫొటో ఫర్ఫెక్ట్ మెగా ఫ్యామిలీ. కానీ శ్రీజ మాత్రమే తన లైఫ్ పార్ట్‌నర్‌తో లేదు. ఆమె మాత్రమే సింగిల్‌గా ఉంది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో శ్రీజ మరోసారి వార్తలో నిలిచింది.

Read More..

వరుణ్-లావణ్యకు నందమూరి బాలకృష్ణ పంపిన స్పెషల్ గిఫ్ట్ ఏంటో తెలుసా?

Next Story

Most Viewed