‘పెద్ది’ రిలీజ్ డేట్.. పొరపాటు జరిగిందంటూ క్షమాపణలు కోరిన SKN.. మాట మార్చడానికి బెదిరింపులే కారణమా ?

by Mallepaka Hamsa |

పెద్ది’ రిలీజ్ డేట్ ఇప్పటికే అనౌన్స్ చేసేశారేమో అని పొరపడి.. ఆ డేట్‌కి మన ‘చెన్నై లవ్ స్టోరీ’ రాదని స్టేజీపై చెప్పేశాను. కానీ వేదికపై నుంచి కిందికి దిగాక తెలిసింది.

‘పెద్ది’ రిలీజ్ డేట్.. పొరపాటు జరిగిందంటూ క్షమాపణలు కోరిన SKN.. మాట మార్చడానికి బెదిరింపులే కారణమా ?
X

దిశ, సినిమా: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పెద్ది’ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని మెగా అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న వేళ, రిలీజ్ డేట్ విషయంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ‘చెన్నై లవ్ స్టోరీ’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత ఎస్కేఎన్ (SKN) ‘పెద్ది’ విడుదల తేదీని అనౌన్స్ చేయడంతో ఒక్కసారిగా అంతా షాక్‌కు గురయ్యారు. జూన్ 25న ఈ మెగా ప్రాజెక్ట్ థియేటర్లలోకి రాబోతోందని ఆయన స్టేజీపైనే ప్రకటించేశారు. అయితే, అధికారికంగా చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన చేయకముందే ఎస్కేఎన్ ఇలా డేట్ చెప్పడం పెద్ద వివాదానికి దారితీసింది. దీంతో వెంటనే జాగ్రత్త పడిన ఎస్కేఎన్ ఓ వీడియో విడుదల చేస్తూ వివరణ ఇచ్చాడు.

"చెన్నై లవ్ స్టోరీ ఫస్ట్ సింగిల్ లాంచ్ ఈవెంట్‌లో చిన్న మిస్ కమ్యూనికేషన్ జరిగింది. వేదికపై జనం అరుపులు, గోల వల్ల నేను ఒక విషయాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. అందుకే ‘పెద్ది’ రిలీజ్ డేట్ గురించి మాట్లాడాల్సి వచ్చింది.ఈ చిత్రం ఎప్పుడు విడుదల చేద్దామని నేను డైరెక్టర్ సాయి రాజేష్‌ని అడిగితే.. ఆయన ‘పెద్ది సినిమా జూన్ 26న విడుదల అవుతున్నట్లు ట్విట్టర్‌లో కొన్ని వార్తలు కనిపిస్తున్నాయి. వాళ్లు అధికారికంగా అనౌన్స్ చేసే వరకు నువ్వు మన మూవీ రిలీజ్ డేట్ ఏమీ చెప్పకు’ అని నాకు ముందే చెప్పాడు. కానీ ఈవెంట్లో ఉన్న హడావుడిలో నేను సాయి రాజేష్ చెప్పిన మాటను సరిగ్గా వినలేదు. ‘పెద్ది’ రిలీజ్ డేట్ ఇప్పటికే అనౌన్స్ చేసేశారేమో అని పొరపడి.. ఆ డేట్‌కి మన ‘చెన్నై లవ్ స్టోరీ’ రాదని స్టేజీపై చెప్పేశాను. కానీ వేదికపై నుంచి కిందికి దిగాక తెలిసింది.. ఇంకా ‘పెద్ది’ మేకర్స్ ఎలాంటి డేట్ ప్రకటించలేదని. నేనేదో ఒక మాట అనడం వల్ల, ఒక పెద్ద సినిమా రిలీజ్ డేట్ నేనే స్వయంగా చెప్పినట్లు అయిపోయింది.

దీనివల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే నన్ను క్షమించమని కోరుతున్నాను. అన్యధా భావించవద్దు. నా ఉద్దేశం ఏంటంటే.. ఏ పెద్ద సినిమా లేని రోజే మా చిత్రం రావాలని.పెద్ది వాయిదా పడినట్లు నేను ఎక్కడా వినలేదు. ఆ మూవీ ఏ డేట్‌కి రిలీజైనా పెద్ద విజయం సాధిస్తుంది. నేనేదో మాట్లాడినట్లు తప్పుగా తీసుకోవద్దు. ఇది కేవలం నా అవగాహన లోపం వల్ల జరిగిన పొరపాటు మాత్రమే. దయచేసి నన్ను క్షమించండి’’ అని అన్నారు. ఎస్కేఎన్ ఈ రకంగా వివరణ ఇచ్చినప్పటికీ, నెటిజన్లు మాత్రం ఆయన మాట మార్చడం వెనుక ఎవరో బెదిరించి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Next Story