పాయల్‌కు షాకిచ్చిన ప్రియుడు.. తనముందే మరో అమ్మాయికి ప్రపోజ్!

by Disha Web Desk 17 |
పాయల్‌కు షాకిచ్చిన ప్రియుడు.. తనముందే మరో అమ్మాయికి ప్రపోజ్!
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్‌కు తన ప్రియుడు సౌరభ్ ధింగ్రా ఊహించని షాక్ ఇచ్చాడు. రెండేళ్ల కిందట వాలెంటైన్స్‌ డే సందర్భంగా పాయల్ తన బాయ్‌ఫ్రెండ్‌ను అభిమానులకు పరిచయం చేసిన విషయం తెలిసిందే. కాగా సరిగ్గా అదే ప్రేమికుల రోజున పాయల్ ముందే మరొక అమ్మాయికి ప్రపోజ్ చేసి నెటిజన్లను ఆశ్చర్యపరిచాడు. ఈ మేరకు వాలెంటైన్స్ డే స్పెషల్ పార్టీ కోసం తన ప్రియుడితో కలిసి మరో ఇద్దరు అమ్మాయిలను వెంటపట్టుకెళ్లిన పాయల్‌.. ఈ ఊహించని సంఘటనతో ఆందోళనకు గురైంది.

రిసార్ట్‌లోని స్విమ్మింగ్ ఫూల్ వద్ద మోకాళ్లపై కూర్చొని మరొక అమ్మాయికి ప్రపోజ్ చేస్తూ రింగ్ చూపించిన సౌరభ్.. ఆమె అంగీకరించడంతో ఆనందంలో మునిగిపోయాడు. అయితే పక్కనున్న పాయల్ మరో అమ్మాయి ఏడుస్తూ తన దగ్గరున్న టెడ్డీని నెలకు బలంగా కొట్టడం ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన వీడియోలో కనిపించింది. ప్రస్తుతం ఈ ఫన్నీ పోస్ట్ వైరల్ అవుతుండగా 'పాపం పాయల్.. బాధాకరమైన విషయం' అంటూనే 'ముగ్గురమ్మాయిలతో ముద్దుల ప్రియుడు' అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.



Next Story

Most Viewed