యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న పవన్ ‘Bro’ ట్రైలర్..

by Disha Web Desk 6 |
యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న పవన్ ‘Bro’ ట్రైలర్..
X

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రో’. ఈ సినిమాను తమిళ దర్శకుడు సముద్రఖని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో కెతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే బ్రో ట్రైలర్‌ను నిన్న సాయంత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా జూలై 28న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది.

తాజాగా, ఈ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకు 14 మిలియన్లకు పైగా రియల్ టైమ్ వ్యూస్ వచ్చాయని చిత్ర బృందం ప్రకటించింది. అంతేకాకుండా 5 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయని, యూట్యూబ్‌లో ట్రెండింగ్ నెంబర్‌1గా ఉందని తెలిపింది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Also Read: అశ్విన్ బాబు ‘హిడింబ’ 3 రోజుల కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Next Story

Most Viewed