మ‌రో సినిమాకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ్రీన్ సిగ్న‌ల్‌..పాలిటిక్స్ చుట్టే క‌థ?

by velandi.Saikiran |

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పొలిటికల్ డ్రామా నేపథ్యంలో వచ్చే సినిమాకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

మ‌రో సినిమాకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ్రీన్ సిగ్న‌ల్‌..పాలిటిక్స్ చుట్టే క‌థ?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ స్టార్ హీరో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan)రెండు రంగాల్లో కూడా దూసుకు వెళ్తున్నారు. రాజకీయాల్లో కొనసాగుతూనే ఇటు ఛాన్స్ దొరికినప్పుడు సినిమాలు చేస్తున్నారు. సినిమాలు చేసి చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నారు పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ ఇటీవల OG సినిమాతో బంపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో బిజీగా ఉన్నాడట పవన్ కళ్యాణ్. ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ఫైనల్ కాలేదు.

త్వరలో దీనిపై క్లారిటీ రానుంది. అయితే అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. అది కూడా వంశీ పైడిపల్లి ( Vamshi Paidipally ) దర్శకత్వంలో పొలిటికల్ డ్రామా నేపథ్యంలో వచ్చే సినిమాకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ సినిమాకు దిల్ రాజు ( Dil Raju) నిర్మాతగా వ్యవహరించే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి దాదాపు 6 నెలలు పట్టే ఛాన్సులు ఉన్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో కూడా రాబోతుందట. క్లిక్

Next Story