- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవర్ స్టార్‌తో విడాకులు.. రూ. 30కోట్లు డిమాండ్ చేస్తున్న పవన్ భార్య
భోజ్‌పురి పవర్ స్టార్ పవన్ సింగ్, అతని భార్య జ్యోతి సింగ్ మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పవన్ బీజేపీలో చేరగా.. జ్యోతి ప్రశాంత్ కిశోర్‌కు మద్దతిస్తుంది. దీంతో విడాకులు కన్ఫర్మ్ అని తేలిపోయింది. అయితే ఇందుకోసం జ్యోతి రూ. 30కోట్ల భరణం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది

దిశ, వెబ్ డెస్క్ : భోజ్‌పురి పవర్ స్టార్ పవన్ సింగ్, అతని భార్య జ్యోతి సింగ్ మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పవన్ బీజేపీలో చేరగా.. జ్యోతి ప్రశాంత్ కిశోర్‌కు మద్దతిస్తుంది. దీంతో విడాకులు కన్ఫర్మ్ అని తేలిపోయింది. అయితే ఇందుకోసం జ్యోతి రూ. 30కోట్ల భరణం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎమోషనల్ బ్లాక్ మెయిల్, అవమానం, గర్భస్రావం సహా అనేక ఆరోపణలు చేసిన జ్యోతి.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె న్యాయవాది చెప్పారు. అయితే పవన్ లాయర్ దీన్ని అసాధారణంగా తిరస్కరించాడు. నిజమైన ఆదాయం, ఆస్తుల ఆధారంగా అలిమొనీ నిర్ణయించబడుతుందని చెప్పాడు.
కాగా 2021లో వివాహం చేసుకున్న పవన్, జ్యోతి మధ్య కొద్ది కాలంలోనే మనస్పర్థలు స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పవన్‌కు వ్యతిరేకంగా జ్యోతి పొలిటికల్ టర్న్ తీసుకుందని.. అందుకే దూరమయ్యారని టాక్. చాలా సార్లు అతన్ని కలుద్దామని ట్రై చేసినా.. చాన్స్ ఇవ్వలేదని గతంలో చెప్పింది జ్యోతి. ఈ క్రమంలో కొందరు పవన్‌కు సపోర్ట్ చేస్తుంటే.. ఇంకొందరు జ్యోతికి మద్దతు ఇస్తున్నారు.






