పవన్ కల్యాణ్ ‘OG’ ఓవర్ సీస్ రైట్స్‌కు భారీ డిమాండ్!

by Mallepaka Hamsa |   (  Updated:2023-09-05 07:36:47  IST  )

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘OG’ ఒకటి. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం అభిమానులు అంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

పవన్ కల్యాణ్ ‘OG’ ఓవర్ సీస్ రైట్స్‌కు భారీ డిమాండ్!
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘OG’ ఒకటి. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం అభిమానులు అంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు వరుస రీమేక్ చిత్రాలతో అలరించిన పవన్ ‘OG’తో డైరెక్ట్ సినిమా చేస్తున్నారు. దీంతో ఈ మూవీపై అంచనాలు బాగా పెరిగిపోయాయి. ఇక తాజాగా పవన్ పుట్టినరోజున పురస్కరించుకుని ఈ చిత్రం నుంచి అదిరిపోయే గ్లింప్స్‌ విడుదల చేయగా 24 గంటల్లో 730K లైక్స్, 17 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ ఓవర్ సీస్ డీల్ క్లోజ్ చేసినట్లు సమాచారం. ఓవర్ సీస్‌ను రూ.13 కోట్ల రేటుకు ఫారన్ ఫిలింస్ సంస్థ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో వచ్చిన పవన్ సినిమాలతో పోల్చుకుంటే ఇది మంచి రేటు అని చెప్పాలి.

Next Story