‘ఓజీ’ స్పెషల్ సాంగ్‌లో పవన్ కళ్యాణ్‌తో చిందులేయబోతున్న టిల్లు బ్యూటీ..

by Mallepaka Hamsa |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఓజీ’(og).

‘ఓజీ’ స్పెషల్ సాంగ్‌లో పవన్ కళ్యాణ్‌తో చిందులేయబోతున్న టిల్లు బ్యూటీ..
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఓజీ’(og). ఈ సినిమా కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. సుజిత్ (sujith)దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఇటీవల కార్మికుల సమ్మె కావడంతో షూటింగ్‌కు బ్రేకులు పడగా.. మళ్లీ ప్రారంభించారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘ఓజీ’ సినిమాకు సంబంధించిన వరుస అప్డేట్స్ విడుదలవుతున్నాయి. ప్రస్తుతం మ్యూజికల్ జర్నీ‌లో ఫుల్ బిజీగా ఉన్న చిత్రబృందం వినాయక చవితికి సెంకండ్ సింగిల్ రిలీజ్ చూసి ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చారు.

తాజాగా, ‘ఓజీ’ సినిమాకు సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ మూవీలో టిల్లు బ్యూటీ నేహా శెట్టి ఐటమ్ సాంగ్ చేయబోతున్నట్లు టాక్. ఇక ఈ విషయాన్ని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లో పాల్గొన్న నేహా కన్మర్మ్ చేసింది. తానే ఓజీలో సర్‌ప్రైజ్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నట్లు వెల్లడించింది. కానీ ఐటమ్ సాంగ్ చేస్తుందా.. లేక ఓ పాత్రలో నటిస్తుందా అని క్లారిటీ ఇవ్వలేదు. దీంతో అంతా ఐటమ్ చేస్తుందని ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికే పవన్ యాక్షన్స్, లుక్స్ ‘ఓజీ’ అంచనాలను పెంచగా.. నేహా ఎంట్రీ సినిమాకు అదనపు హైలెట్ కాబోతుంది. ఈ అమ్మడుకి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్నందుకు ఆమె ‘ఓజీ’లో పవన్ సరసన చిందులేస్తే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే అని అంతా అభిప్రాయపడుతున్నారు.

Next Story