పవన్ కల్యాణ్ అభిమానులు బిగ్ సర్‌ప్రైజ్

by Disha Web Desk 12 |
పవన్ కల్యాణ్ అభిమానులు బిగ్ సర్‌ప్రైజ్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ టాప్ హీరో పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు భారీ సర్‌ప్రైజ్ ఇచ్చారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ హీరోగా.. మొగల్ సామ్రాజ్య కథతో 'హరిహర వీరమల్లు' తెరకెక్కుతుంది. కాగా పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అర్ధరాత్రి 12:17కు ఈ సినిమా నుంచి మరో కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో పవన్ కల్యాణ్ ఊరమాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. అలాగే, స్టైలిష్ వాకింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఇక, ఈ పోస్టర్ బ్యాగ్రౌండ్‌లో ప్రత్యర్థులు దెబ్బలు తిని పడిపోయి ఉండడం కనిపించింది.

కాగా ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ సినిమా ప్రారంభమై చాలా రోజులైతున్నప్పటికి పవన్ బిజీ షెడ్యూల్ కారణంగా షూటింగ్ ఇంకా పూర్తి చేసుకోలేదు. పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న 'హరిహర వీరమల్లు' సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో ఐదు భాషల్లో రూపొందుతోంది. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్‌గా.. నిధి అగర్వాల్ కీలక పాత్రను చేస్తుంది. ఆస్కార్ గ్రహీత కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు.


Next Story

Most Viewed