చిలుకతో అక్కడ కరిపించుకున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్.. వైరల్‌గా మారిన క్యూట్ వీడియో

by Mallepaka Hamsa |   (  Updated:2025-07-29 12:51:40  IST  )

యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhi Agarwal) ‘సవ్యసాచి’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

చిలుకతో అక్కడ కరిపించుకున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్.. వైరల్‌గా మారిన క్యూట్ వీడియో
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhi Agarwal) ‘సవ్యసాచి’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో హిట్ అందుకుని ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది. ఇక ఇటీవల ఈ అమ్మడు భారీ ప్రాజెక్ట్ ‘హరి హర వీరమల్లు’(Hari Hara Veeramallu) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా నటించిన ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఇందులో అర్జున్ రాంపాల్, బాబీ డియోల్(Bobby Deol), అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించారు. భారీ అంచనాల మధ్య ఈ పీరియాడికల్ మూవీ జులై 24న థియేటర్స్‌లో విడుదలై మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా, నిధి అగర్వాల్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో నిధి పాప ఓ సినిమా షూటింగ్‌లో చిలుకతో ఆడుకుంటోంది. దాన్ని చేతిపై నిల్చొబెట్టుకుని మాట్లాడుతూ కనిపించింది. అది పైకి ఎక్కుతూ చేతులను కరుస్తుండగా.. ఈ అమ్మడు చాలా భయపడిపోయింది. దీంతో పక్కనే ఉన్న వ్యక్తి దానిని తీసుకోవడం కాస్త రిలాక్స్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. అది చూసిన నెటిజన్లు క్యూట్ నిధి పాప అని కామెంట్లు చేస్తున్నారు. కాగా, నిధి సినిమాల విషయానికొస్తే.. ‘ది రాజా సాబ్’ హారర్ కామెడీ చిత్రంలో నటిస్తోంది. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తుండగా.. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ మూవీ భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న థియేటర్స్‌లోకి రాబోతుంది.

Next Story