సంయుక్తాను మాట్లాడనివ్వకుండా చేసిన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ (వీడియో)

by Disha Web Desk 6 |
సంయుక్తాను మాట్లాడనివ్వకుండా చేసిన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతుంది. ప్రస్తుతం మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌ సరసన ‘వీరూపాక్ష’ మూవీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఏప్రిల్ 21న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరిపారు. అందులో భాగంగా స్టేజ్‌పై సంయుక్తా మీనన్ పవర్ స్టార్ ఫ్యాన్స్ మాట్లాడనివ్వకుండా అరుపులతో హోరెత్తించారు. దీంతో అది విన్న సంయుక్త ‘ఫ్యాన్స్ అంటే ఇలా ఉండాలి. పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఏంటో నాకు తెలుసు. నేను కూడా పవన్ గారికి పెద్ద ఫ్యాన్ మీ ఎనర్జీ నాకు తెలుసు’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ప్రీరిలీజ్‌ కార్యక్రమానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story

Most Viewed