వంద కోట్లకు చేరువలో Pawan Kalyan ‘BRO’!

by Dishanational2 |
వంద కోట్లకు చేరువలో Pawan Kalyan ‘BRO’!
X

దిశ, సినిమా: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ‘బ్రో’ హవా నడుస్తోంది. ఆరంభం నుంచి భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకున్న ఈ సినిమా జూలై 28 న ప్రేక్షకుల ముందుకు వచ్చి అంచనాలను మించి ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులో పవన్ తన నటనలో కొత్తధనం చూపించి ఫ్యాన్స్‌ను చాలా తృప్తిపరిచాడు. ఇక కలెక్షన్‌ల విషయానికొస్తే మొదటి రోజు రూ. 30.05 కోట్లు రాబట్టగా 2వ రోజు కొంచెం తగ్గి రూ.19.78 కోట్లు వచ్చాయి. అయినప్పటికి విడుదలైన రెండు రోజుల్లోనే రూ.50.05 కోట్ల క్లబ్‌లో చేరింది. రాబోయే వారాంతంలో మరిన్ని వసూళ్లు సాధించే అవకాశం ఉండగా వంద కోట్లకు చేరుకుంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.


Next Story