- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ కళ్యాణ్ రాకతో బాక్సులు బద్దలైపోవాల్సిందే.. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ పై హైప్ పెంచిన దేవిశ్రీ ప్రసాద్
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) 46 ఏళ్లు వచ్చినప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

దిశ, సినిమా: స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) 46 ఏళ్లు వచ్చినప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల కోసం పని చేసిన ఆయన కొత్త అవతారమెత్తబోతున్నాడు. త్వరలోనే హీరోగా మారబోతున్నాడు. ఆయన సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. హీరోగా మారడమే కాకుండా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’(Ustad Bhagat Singh)కు వర్క్ చేస్తున్నారు. తాజాగా, జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకు దేవిశ్రీ ప్రసాద్ గెస్ట్‌గా వచ్చారు.
ఇక ఇందులో ఆయన చేసిన పలు కామెంట్స్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ‘‘ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా చాలా బాగా వస్తుంది. ఒక్కో సీన్‌లో పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ను చూస్తే బాక్సులు బద్దలైపోతాయి. రెండు సాంగ్స్ షూటింగ్ జరిగాయి. చాలా రోజుల తర్వాత పవన్ డ్యాన్స్ ఇరగదీశారు. ఒకరోజు సెట్‌కి రమ్మంటే వెళ్లాను.. ఆయన నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి.. దేవి మళ్లీ ఇన్నాళ్లకు నాకు డ్యాన్స్ చేయాలనిపించేలా చేశావని అన్నారు. సాంగ్స్ చాలా బాగున్నాయని పొగిడారు. ఆ తర్వాత హరీష్ గారు సాంగ్స్ రష్ చూపించారు.
మేమైతే వన్స్ మోర్ అని స్టూడియోలోనే సంబరాల చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది’’ అని చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఎప్పుడెప్పుడు ఆ సాంగ్స్ రిలీజ్ చేస్తారా? అని అభిమానులంతా మూవీ టీమ్‌ను ప్రశ్నిస్తున్నారు. కాగా.. శ్రీలీల, పవన్ కళ్యాణ్, రాశీ ఖన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ దశలో ఉండగా.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం పవన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.






