Pawan Kalyan :రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఆడ బిడ్డ.. పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదే.!

by Chukka Sudharani |   (  Updated:2023-06-21 12:08:42  IST  )

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

Pawan Kalyan :రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఆడ బిడ్డ.. పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదే.!
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. పెళ్లైన పదేళ్ల తర్వాత ఫ్యామిలీలోకి ప్రిన్సెస్ రావడంతో మెగా కుటుంబంతో పాటు.. మెగా అభిమానులు కూడా సంబురాలు చేసుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీతో పాటు.. చాలామంది సెలబ్రిటీలు, అభిమానులు రామ్ చరణ్, ఉపాసనలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా తన అభినందనలు చర్రి, ఉపాసనలకు తెలియజేశారు. ఈ మేరకు ‘‘రామ్ చరణ్-ఉపాసన దంపతులకు ఆడబిడ్డ జన్మించిన తరుణాన ప్రేమపూర్వక శుభాకాంక్షలు.. శుభాశీస్సులు’’ అంటూ తెలిపారు.

Also Read.

కమెడియన్ సుధాకర్ కొడుకుకి అండగా నిలిచిన చిరంజీవి..

Next Story