సాయిధరమ్ తేజ్‌ను రక్షించిన వ్యక్తికి పబ్లిక్‌గా థాంక్స్ చెప్పిన పవన్.. వీడియో

by Disha Web Desk 7 |
సాయిధరమ్ తేజ్‌ను రక్షించిన వ్యక్తికి పబ్లిక్‌గా థాంక్స్ చెప్పిన పవన్.. వీడియో
X

దిశ, సినిమా: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చావు బతుకుల్లో ఉన్న సాయి ధరమ్ తేజ్ సరైన సమయంలో చికిత్స అందడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే తేజ్‌ను టైమ్‌కు హాస్పిటల్ తీసుకెళ్లిన వ్యక్తి అబ్దుల్. అప్పట్లో అతని గురించి చాలా వార్తలు వచ్చాయి. ఇక తాజాగా జరిగిన ‘బ్రో’ ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ అబ్దుల్‌ను గుర్తు చేసుకున్నాడు.

‘సడెన్‌గా నాకు కాల్ వచ్చింది తేజ్‌కి యాక్సిడెంట్ అయిందని. మేమంతా వెళ్లి చూసేసరికి కోమాలోకి వెళ్లిపోయాడు. చాలా బాధనిపించింది. కానీ రోడ్డుమీద పడివున్న తేజ్‌ను కరెక్ట్ టైంకి హాస్పిటల్‌లో చేర్పించాడు అబ్దుల్. నిజంగా సహాయం చేయాలంటే కులం, మతం చూడకూడదు. ఎందుకంటే ప్రమాదం మనకు ఎలా వస్తుంది, ఎక్కడనుండి వస్తుందో తెలియదు. అందుకే మానవత్వంతో ఉండాలి. ఇప్పుడు ఇస్లాం మతస్థుడైన అబ్దుల్‌లో ఉన్న మానవత్వమే తేజ్‌ను కాపాడింది. అతను లేకుంటే ఇప్పుడు తేజ్ ప్రాణాలతో మన ముందు ఉండేవాడు కాదు. అందుకే మళ్లీ నేను మనస్ఫూర్తిగా అబ్దుల్‌కు కృతజ్ఞతలు చెబుతున్నా’ అంటూ పవన్ ఎమోషనల్ అయ్యాడు.

Read Also..

భార్యాభర్తలు విడిపోకుండా ఉండాలంటే.. ఈ సూత్రాలు పాటించాల్సిందే

వర్షాకాలంలో ఆకుకూరలు తింటే ఏం జరుగుతుందో తెలుసా.. నిపుణులు ఏం అంటున్నారంటే..

Next Story