గుడ్‌న్యూస్: పవన్ కల్యాణ్ సినిమా ట్రైలర్ విడుదల

by Disha Web Desk 2 |
గుడ్‌న్యూస్: పవన్ కల్యాణ్ సినిమా ట్రైలర్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిరోజు సందర్భంగా అభిమానుల కోరిక మేరకు సెప్టెంబర్ 1వ తేదీన 'జల్సా' సినిమాను ప్రపంచ వ్యాప్తంగా నాలుగువేల థియేటర్లలో మళ్లీ విడుదల చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను అభిమానులు రూపొందించడం గమనార్హం. కాగా, పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సమీపిస్తోన్న తరుణంలో అభిమానుల హంగామా మామూలుగా లేదు. గత వారం నుంచే సోషల్ మీడియాను పవర్ స్టార్ ఫ్యాన్స్ షేక్ చేస్తున్నారు. అభిమాన హీరోకు వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే గతవారం రోజుల నుంచి ట్విట్టర్‌ ట్రెండింగ్‌లో ఉంటున్నారు పవర్ స్టార్. అయితే, జల్సా సినిమాలో పవన్ కల్యాణ్ సరసన ఇలియానా నటించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. అల్లు అర్వింద్ నిర్మించిన ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. అయితే, గతేడాది పవన్ కల్యాన్ పుట్టినరోజు సందర్భంగా థియేటర్లలో గబ్బర్ సింగ్ సినిమాను మళ్లీ విడుదల చేయడంతో థియేటర్లకు అభిమానుల తాకిడి మామూలుగా లేదు. ఇక, ఈసారి జల్సా లాంటి సెన్సేషన్ సినిమా విడుదల చేస్తుండంతో ఫ్యాన్స్ రచ్చ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Next Story

Most Viewed